తెలుగుదేశం సీనియర్ నాయకుడు వల్లభనేని బాబూరావు కన్నుమూత

Publish Date:May 2, 2026

Advertisement

తెలుగుదేశం పార్టీలో  విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వల్లభనేని బాబు రావు శనివారం ( (మే 2) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న టీడీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

బాబు రావు గన్నవరం నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుడిగా ఆయనకు  గుర్తింపు ఉంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన..  కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలబడేవారు.  పార్టీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ కోసం సర్వం ఒడ్డి పని చేశారు. వల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.  బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

బాబురావు అంత్యక్రియలకుపెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, అభిమానులు హాజరయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్థానిక నేతలు స్మరించుకుంటున్నారు. ఒక క్రమశిక్షణ గల నాయకుడిని కోల్పోవడంతో గన్నవరం టీడీపీలో ఒక శకం ముగిసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, భవిష్యత్తులో ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని స్థానిక నాయకత్వం పేర్కొంది.

By
en-us Political News

  
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు. గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్ట‌ప్ ఇండియా, అట‌ల్ ఇన్నోవేష‌న్ మిష‌న్ వంటి ప‌థ‌కాలు యువ పారిశ్రామిక వేత్త‌ల‌కు గొప్ప అవ‌కాశాల‌కు రాచ‌బాట ప‌రుస్తున్నాయి. నేడు భార‌త్ లో 1. 25 ల‌క్ష‌ల‌కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట‌ప్స్ ఉన్నాయి. ఇందులో స‌గానికి పైగా టూ టైర్ 2, 3 ప‌ట్ట‌ణాల నుంచి మొద‌లైన‌వి కావ‌డం విశేషం.
ఈ ట్రయల్ లో భాగంగా  ప్రజల ఫోన్లకు శనివారం  అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.