శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని టిడిపి క్యాడర్ కు నడిపించే నాయకుడు కరువయ్యాడు. టిడిపి సీనియర్ మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వరుసగా మూడు సార్లు ఇక్కడ్నించి గెలుపొందారు. తరువాత రెండు వేల తొమ్మిది, రెండు వేల పద్నాలుగు లోనూ ఆయన విజయం సాధించారు. రెండు వేల పద్నాలుగు లో ఆయన చంద్రబాబు మంత్రి వర్గంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే అనారోగ్యం వల్ల ఎన్నికలకు ఏడాది ముందు ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలిగించారు. ఆ ఎఫెక్ట్ తో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని కొడుకు సుధీర్ రెడ్డికి రాజకీయ వారసత్వం కట్టబెట్టారు. అయితే అప్పటికే బొజ్జల కుటుంబంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇక సుధీర్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. చివరికి పార్టీ లోనూ అతని అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయిన అప్పటికీ శ్రీకాళహస్తి టికెట్ రేసులో ఉన్న టిడిపి నేత ఎస్వీవీ నాయుడుని కాదని చంద్రబాబు బొజ్జల కుటుంబానికి సీటు కేటాయించారు.
ఆ ఎన్నికల్లో సుధీర్ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరువాత టిడిపి అధికారంలోకి రావటం బొజ్జల గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో పూర్తి స్థాయిలో చక్రం తిప్పారని తమ్ముళ్లు అంటున్నారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే పార్టీకి ఎన్నికల ముందు నుంచే చెడ్డపేరూ వచ్చింది అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. చివరకు అనుకున్నదే జరిగిన బొజ్జల తనయుడు తీరులో మాత్రం మార్పు రావడం లేదనే టాక్ నియోజక వర్గంలో వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత సుధీర్ రెడ్డి పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారని పార్టీని, కేడర్ ను పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే శ్రీకాళహస్తి వచ్చిన సుధీర్ కొద్దిమంది నేతలతో అలా అలా మాట్లాడి వెళ్లారే తప్ప కార్యకర్తల సమస్యలను పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ, బీజేపీ గూటికి చేరి పోయారు. మిగిలిన నేతలు బిజెపి శ్రీకాళహస్తి ఇంచార్జ్ కోలా ఆనంద్ తో నిత్యం టచ్ లో ఉంటున్నారని సమాచారం. వారు రేపొమాపో కండువా మార్చటం ఖాయమనే టాక్ కూడా వినపడుతోంది. నియోజక వర్గంలోని ఏర్పేడు,
రేణిగుంట, శ్రీకాళహస్తి పట్టణాలకు సంబంధించిన పార్టీలోని కీలక నేతలు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీలలోకి వెళుతున్న పట్టించుకున్న వారే కరువయ్యారని తెలుగు ప్రజలు అంటున్నారు. విషయాన్ని సుధీర్ రెడ్డికి చెప్పినా ఫలితం లేకపోవటంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారనీ పరిస్థితి ఇలానే ఉంటే త్వరలోనే శ్రీకాళహస్తి టిడిపి ఖాళీ అవుతుందనే అభిప్రాయాన్ని పార్టీ కార్యకర్తలే బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అధినేత చంద్రబాబు స్వయంగా ఇసుకపై ఆందోళన చేయాలని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తిలో మాత్రం వాటి జాడే కనపడలేదు. ఏదేమైనా సుధీర్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న తెలుగు ప్రజలు ఇప్పటికైనా అధినేత స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-position-in-srikalahasti-25-89779.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.