సైకిల్ చక్రాలకి ... కమలం పంక్చర్లు చేస్తోందా?
Publish Date:Nov 28, 2016
Advertisement
ఒక్కసారి గెలిస్తే మళ్లీ 5ఏళ్ల వరకూ తమకు తిరుగుండదని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. స్వంత మెజార్టీతో గెలిస్తే అది నిజం కూడా! కాని, ఈ మధ్య మీడియా ఎక్కువయ్యాక ఆర్నెళ్లకి, సంవత్సరానికి ఎవరో ఒకరు సర్వేలు చేస్తూనే వున్నారు. జనం చెప్పారంటూ రకరకాల ఫలితాలు ముందుంచుతున్నారు. తాజాగా ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే అంటూ ఒక ఛానల్ సర్వే నిర్వహించింది... ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది...
ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే. ఈ ఇద్దరిలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? ఇదీ మెయిన్ క్వశ్చన్. దీనికి యాన్సర్ కనుక్కునే ప్రయత్నం చేసిన సదరు ఛానల్ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకే దాదాపు సగం మంది ఓటర్లు జైకొడతారని తేల్చేసింది! అటు ఇటుగా యాభై శాతానికి దగ్గరలో టీడీపీ, బీజేపి కూటమి ఓట్లు సంపాదిస్తుందని చెప్పింది. వైసీపీకి ఓట్ల శాతం గతం కంటే పడిపోతుందని కూడా సర్వే వెల్లడించింది.
ఏపీని రెండున్నరేళ్లుగా ఏలుతోన్న సైకిల్, కమలం జోడీ బాగానే వర్కవుట్ అవుతోన్నా... జనంలో మాత్రం ట్రెండ్ వేరుగా వుంది. తాజా సర్వే ప్రకారం, ఆంధ్రాలో టీడీపీ వల్ల బీజేపికి కలుగుతోన్న లాభం కంటే బీజేపి వల్ల టీడీపీకి అవుతోన్న నష్టం ఎక్కువున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, సర్వేలో జనం ఓన్లీ టీడీపికి 140సీట్లు ఇస్తామన్నారట! అదే కాషాయదళంతో కలిసి వస్తే పచ్చ పార్టీకి 120సీట్లు మాత్రమే జనం అందించే అవకాశం వుందట. ఇందుకు కారణాలు కూడా సర్వే చేసిన ఛానల్ విశ్లేషించింది. హోదా ఇవ్వనందుకు కేంద్రంలోని బీజేపిని జనం సీరియస్ గా తీసుకుంటున్నారట. అంతే కాదు, ఇచ్చిన ప్యాకేజ్ విషయంలో కూడా పెద్దగా స్పష్టత ఇవ్వనందుకు ఆంధ్రులు బీజేపీనే టార్గెట్ చేసుకుంటున్నారట. ఇక తాజాగా జరిగిన నోట్ల రద్దు నిర్ణయం, తరువాత ఎదురవుతోన్న సమస్యలు... వీటికి కూడా జనం కమలదళాన్నే కారణంగా భావిస్తున్నారట. వీటన్నటి కారణంగా టీడీపీ బీజేపితో కలిసి వుండటం కంటే విడిపోవటమే బెటర్ అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి...
టీవీల్లో వచ్చే సర్వేలు చూసి చంద్రబాబు, అమిత్ షా తమ నిర్ణయాలు తీసుకోరు కాని... మరో రెండున్నరేళ్లు టర్మ్ మిగిలి వుంది. ఇప్పటికిప్పుడు విడిపోతే కొత్తగా తెలుగు దేశం ఎమ్మెల్యేల్ని గెలిపించుకునే అవకాశం ఏం లేదు. అలాగే, స్వంత మెజార్టీతో ప్రధాని అయిన మోదీకి కూడా లాస్ లేదు. కాబట్టి ఏపీలోని టీడీపీ, బీజేపి పొత్తు క్రాష్ అయ్యే ఛాన్సెస్ కనిపించటం లేదు. అదీ కాక మొన్నటికి మొన్న చాలా సర్వేలు హిల్లరీ గెలుస్తుందంటే ట్రంప్ నెగ్గాడు. కాబట్టి సర్వేల్ని కూడా గుడ్డిగా నమ్మటానికి అస్సలు వీల్లేదు...
http://www.teluguone.com/news/content/tdp-45-69576.html





