ఢిల్లీకి 30... ముంబైకి 31!
Publish Date:Nov 28, 2016
Advertisement
ఢిల్లీ అనగానే మనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్, ఎంపీలు గర్తుకు వస్తారు. ఇంకా కొంచెం పొలిటికల్ యాక్టివ్ నెస్ వున్న వాళ్లకైతే అరవింద్ కేజ్రీవాల్ కూడా గుర్తుకు వస్తాడు. కాకపోతే, మనకు దేశ రాజధాని ఎప్పుడూ ఏదో ఒక నెగటివ్ రీజన్ తోనే చర్చకొస్తుంది. ఓ సారి నిర్భయ ఉదంతం గురించి నిరసనలు జరిగితే .... మరోసారి విపరీతమైన కాలుష్యం కారణంగా మీడియా ఢిల్లీని డిస్కస్ చేస్తుంది. కాని, ఇప్పుడు ఒక మంచి వార్త కూడా వచ్చింది హస్తిన గురించి!
ఢిల్లీలో ఎప్పుడూ రాజకీయ రచ్చే వుంటుందని అంతా భావిస్తారు. కాని, అంతకంటే ఎక్కువ బిజినెస్ కూడా వుంటోంది ఈ మధ్య. అసలు ఒకప్పుడు దేశ ఆర్దిక రాజధాని ముంబై అనేవారు. ఇప్పుడూ అలానే అంటున్నారు. కాని, ఆల్రెడీ... ముంబైని క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా దాటేసిందట. బిజినెస్ పరంగా కూడా మన రాజకీయాల నగరం బీట్ చేసేసిందట!ఈ విషయం చెబుతోన్నది ఎవరో చిన్నా చితక సర్వేలు చేసే సంస్థ కాదు. ప్రపంచ ప్రఖ్యాత ఆక్సఫర్డ్ ఎకనామిక్స్ వారు చెబుతున్నారు. ప్రపంచంలోని మొత్తం 50 అత్యుత్తమ ఆర్దిక శక్తి కలిగిన నగరాల్లో ఢిల్లీ 30వ స్థానంలో వుంది! స్వాతంత్ర్యానికి ముందు నుంచే వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్ అయిన ముంబై మాత్రం 31వ స్థానంలో నిలిచింది. అంటే... ఢిల్లీ కంటే ఒక్క స్థానం వెనుకబడిపోయిందన్నమాట!
ముంబై కంటే ఢిల్లీని ముందు వరసలో కూర్చోబెట్టడానికి కారణం ఆ నగర జీడీపినే! హస్తిన కోనుగోలు శక్తిలో 370బిలియన్ డాలర్ల జీడీపీతో వుండగా ముంబై 368బిలియన్ డాలర్ల జీడీపీతో వుంది. ఈ కాణంగానే ఒక్క ర్యాంక్ తక్కువగా వచ్చింది ముంబైకి! అయితే, ఎంత కాలుష్యం, ట్రాఫిక్, రోడ్డు మీద చెత్త లాంటి సమస్యలున్నా ఢిల్లీలో వ్యాపారం చేయడం ఈజీనట. అన్ని రకాల అనుమతులు ముంబై కంటే త్వరగా లభిస్తాయట! ఈ కారణంతోనే బీట్ చేయగలిగింది. కాకపోతే, ముందు ముందు మన విశ్వ నగరాలు మరింతగా అభివృద్ధి చెంది తమ వాల్డ్ ర్యాంకింగ్స్ మెరుగు పరుచుకుంటాయని భావిస్తున్నారు ఎక్స్ పర్ట్స్. 2030 నాటికి ఢిల్లీ 11వ స్థానంలో, ముంబై 14వ స్థానంలో వుంటాయని అంచనా వేస్తున్నారు!
ముంబైని బీట్ చేసినప్పటికీ మన రాజధాని నగరం ప్రపంచం అత్యుత్తమ నగరాల్లో ఒకటి వెలుగొందటం... మనందరికీ గర్వకారణం!
http://www.teluguone.com/news/content/delhi-45-69606.html





