Publish Date:Feb 22, 2012
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు అప్పుల్లో ముంచిందన్నారు. రిజర్వేషన్లు తగ్గించడంపై ఆయన మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ సరైన రిజర్వేషన్లు కల్పించారన్నారు. వెనుక బడిన తరగతులను నిర్లక్ష్యం చేస్తే టిడిపి చూస్తూ ఊరుకోదన్నారు. ప్రభుత్వం వివిధ రకాల పన్నులతో ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. చివరకు జుట్టు పన్ను కూడా వేసేట్టు ఉందన్నారు. అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉందన్నారు. కోనసీమలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు సాయం చేస్తుందంటే నమ్మాలా అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ప్రభుత్వం వైఖరి కారణంగా రైతులు వ్యవసాయం మానుకునే పరిస్థితి దాపురించింద్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన రాజీవ్ యువకిరణాల సంగతి తేలుస్తామన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞాన్ని మార్చిందన్నారు. ప్రజా సమస్యలు చెబుతుంటే ముఖ్యమంత్రికి నవ్వు వస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత మాదేనన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష నుండి తప్పించుకోలేరన్నారు. కాంగ్రెసు ఫ్యాబ్ సిటీని ఫాల్స్ సిటీగా మార్చిందన్నారు. కాంగ్రెసుకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో రైతుకు మద్దతు ధర ఉంటే మన రాష్ట్రంలోనే లేదన్నారు. ఢిల్లీలో పదవుల కోసం పైరవీలే తప్ప ప్రజా సమస్యలు వీరికి పట్టడం లేదన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు భారీగా ఉన్నాయన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-24-12097.html
Publish Date:Oct 10, 2026
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు