వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు

Publish Date:Feb 22, 2012

Advertisement

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై..9 రోజులు గడిచినా..ఒక్క చర్చా జరగలేదు. సభలో స్పీకర్‌ నాదెండ్లతో పాటు సిఎం-అధికారపార్టీ సభ్యులు మాత్రమే సభలో అరకొరగా మాట్లాడారు. ఉపఎన్నికల నోటిఫికేషన్‌తో అన్ని పార్టీలు సభను ఇప్పుడు ఎన్నికల లబ్ది కోసం వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రజాసమస్యల కోసం విపక్షాలు చొరవ తీసుకోకపోవడం..చర్చించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం సమావేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఐదు రోజుల అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ..మద్యం సిండికేట్లపై టీడీపీ, తెలంగాణ పై టీఆర్ఎస్ పట్టువీడకపోవడంతో సభ వాయిదాల పర్వంలో నడిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో స్పీకర్‌ విజ్ఞప్తులే బాహ్యప్రపంచానికి కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, సభ జరక్కపోవడానికి ఉపఎన్నికల నోటిఫికేషన్ ఒక కారణమైందనే వాదన వ్యక్తమవుతోంది. ఉపఎన్నికల నోటీఫికేషన్ తో రాజకీయ పార్టీల వ్యూహప్రతివ్యూహాల్లో భారీ మార్పు వచ్చాయని...ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమే, ఈ వ్యూహంలో ఒక భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మద్యం సిండికేట్ల వ్యవహారంపై ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చ జరిపితీరాల్సిందేనని పట్టుబడుతున్న టీడీపీ అవసరమైతే... రాత్రంతా అసెంబ్లీలోనే ఉండాలని నిర్ణయించుకుంది.


11మంది టీఆర్ఎస్ సభ్యలుపై రెండు రోజులపాటు సస్పెన్షన్ వేటు పడింది. అంతకు ముందు సభ అరగంట వాయిదా తర్వాత ప్రారంభం అయినా టీఆర్ఎస్ సభ్యులు తమ పట్టు వీడలేదు. విద్యార్తులపై కేసులు ఎత్తవేయాలంటూ వారు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చించుకుందామని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అయినా టీఆర్ఎస్ సభ్యుల తీరు మారకపోవటంతో  మంత్రి ధర్మాన సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అంతకు ముందు టీఆర్ఎస్ సభ్యులపై చర్య తీసుకునేందుకు..సభాపతి నాదెండ్ల అనుమతి తీసుకున్నారు.
 

ఇదిలావుండగా, సభ వాయిదా పడిన అనంతరం వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, శోభానాగిరెడ్డి బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ దాంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ సమక్షంలోనే ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయరెడ్డిని పిలిపించారు. నిబంధనల ప్రకారం నిధులు విడుదల చేయాలని మంత్రికి స్పీకర్ సూచించారు. కలెక్టర్ నివేదిక రాగానే స్పందిస్తామని ఆనం తెలిపారు. కాగా తనను స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి స్పీకర్ను కోరారు. అయితే సీఎల్పీ కాపీ అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్లు సమాచారం.


కాగా తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మద్యం సిండికేట్లలో అక్రమాలకు పాల్పడ్డ ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణను వెంటనే తొలగించాలని దూళిపాళ్ల డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడ్డ మోపిదేవిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మంత్రులపై చర్యలకు ఎసిబి వెనుకాడుతోందన్నారు.

By
en-us Political News

  
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.