మదర్సాలు జీహాదీలను తయారు చేసే కర్మాగారాలు.. తస్లిమా నస్రీన్.!

Publish Date:Aug 3, 2026

Advertisement

ప్రముఖ ప్రవాస బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ భారతదేశంలో  ఉమ్మడి పౌర స్మృతి అమలు, మదర్సాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మదర్సాలను జిహాదీ కర్మాగారాలుగా అభివర్ణించారు.   సమాజంలో మహిళలపై జరుగుతున్న తీవ్రమైన వివక్షను రూపుమాపాలంటే భారతదేశంతో పాటు   బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో కూడా  ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడమొక్కటే మార్గమన్నారు.  

కోల్‌కతాలో  విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.   ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా పౌరులందరికీ సమానమైన చట్టాలు అమలులో ఉన్నాయన్న తస్లీమా.. ఇండియాలో మాత్రం మహిళలు ఇప్పటికీ చట్టపరంగా, సామాజికంగా  వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మతం పేరుతో మహిళల హక్కులను కాలరాయడం సహించరానిదన్నారు. 

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉమ్మడి పౌర  స్మృతి ముసాయిదాను సమగ్రంగా పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో తస్లీమా చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందూ మహిళలకు తండ్రి ఆస్తిలో  హక్కులు లేవనీ, ఇటువంటి వివక్షతతో కూడిన నిబంధనలను తొలగించాలంటే ఉమ్మడి పౌర  స్మృతి   వంటి  చట్టాలు అవసరమన్నారు. నిజమైన ఆధునికత  సమాజంలో లింగ సమానత్వం ద్వారానే వస్తుందన్నారు. 
మదర్సాల నిర్వహణపై  మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో మదర్సాల అవసరమే లేదని, అవి అసలు కొనసాగకూడదన్నారు.  

విద్యార్థులకు లౌకిక, ఆధునిక విద్యను అందించకుండా మతపరమైన మూఢత్వాన్ని నూరిపోసే మదర్సాలను తొలగించాలని డిమాండ్ చేశారు.   2007లో తస్లీమా రాసిన  ద్విఖండితో  (Dwikhandito) అనే తన ఆత్మకథ పుస్తకంలోని కొన్ని భాగాలపై తీవ్ర నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఆ పరిస్థితుల్లో తస్లిమా   భద్రతా కారణాల దృష్ట్యా కోల్‌కతాను విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ తనకిష్టమైన నగరానికి చేరుకోవడం, ప్రజాస్వామ్య బద్ధమైన భావప్రకటన స్వేచ్ఛకు దక్కిన విజయంగా చెప్పవచ్చు.   ఇండియాలో  పౌర సంబంధాలు మరియు ఉమ్మడి పౌర స్మృతిపై విస్తృత చర్చ జరుగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తస్లిమా నస్రీన్ ఉమ్మడి పౌర స్మృతికి  విస్పష్ట మద్దతు తెలపడం, మదర్సాల తీరును ఎండగట్టడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.  

Taslima Nasreen, Uniform Civil Code, Madrasa Controversy, Kolkata Visit, UCC Support 

By
en-us Political News

  
ఇప్పటివరకు పోలీస్‌ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ ను అమలు చేయనున్నారు.  పోలీస్‌, అంబు లెన్స్‌, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో  ప్రత్యేకత. 112కు ఫోన్‌ చేస్తే కేవలం పోలీస్‌ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు. 
మొత్తం 76 జూనియర్‌ కాలేజీలు ఫైర్‌ ఎన్‌ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్‌ ఎన్‌ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
 ఈ సోదాలు బీహార్ కు  చెందిన ప్రత్యేక ఈడీ బృందం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్,  విశాఖలో మళ్ల విజయప్రసాద్ కు చెందిన  నివాసాలు, వ్యాపార ప్రాంగణాలు,   అనుబంధ కార్యాలయాలలో ఈడీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు. 
దాడికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సేకరించాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా పంజాబ్‌లోని కీలకమైన పోలీస్ స్టేషన్లు, పోలీస్ భవనాలు, సిబ్బందిపై నిరంతరం రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ నిందితులకే అప్పగించారు. మరోవైపు అమృత్‌సర్ ప్రాంతంలో రైల్వే పట్టాల సమీపంలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చిన వ్యవహారంపై తనిఖీలు చేపట్టగా రెండో ఉగ్ర మాడ్యూల్ బయటపడింది.
947లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన ఇండియా.. ఈ ఏడాది 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాసచుసెట్స్ లో పంద్రాగస్టును ఇండియా డేగా జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు
మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతిపై  మంగళవారం ) ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు కస్టడీ గడువు ముగియడంతో అదే రోజు సాయంతరం  అంపోలు జైలుకు తిరిగి తరలించారు.
హర్మూజ్ జలసంధి మూతపడలేదని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ జలమార్గం సురక్షితంగా తెరిచే ఉందని ప్రకటించింది. అమెరికా బలగాలు ఈ మార్గంలో నౌకల రక్షణ కోసం నిరంతరం పహారా కాస్తున్నాయని పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.