ఏ క్షణంలోనైనా తమ్మినేని అరెస్టు.!?

Publish Date:Jul 22, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏ క్షణంలోనైనా అరెస్టు అయ్యే అవకాశాలున్నాయి. బోగస్ డెత్ సర్టిఫికేట్ తో  భూకబ్జాకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన కుటుంబంతో సహా పరారయ్యారు.

అజ్ణాతం నుంచే తమ్మినేని సీతారాం.. తనపై, తన కుటుంబ సభ్యులపై  పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను  క్వాష్ చేయాలని కోరుతూ  దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణి, కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను  హైకోర్టు తిరస్కరించడంతో వారిని పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. 

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన తమ్మినేని కుటుంబం  భూకబ్జా కేసులో తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం (జులై 21)  జస్టిస్ వై. లక్ష్మణరావుతో కూడిన ధర్మాసనం విచారించింది.  దర్యాప్తు ప్రారంభంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో సీఆర్పీసీ క్వాషింగ్ పిటిషన్ల ద్వారా కోర్టులు జోక్యం చేసుకోలేవని ధర్మాసనం స్పష్టం చేసింది.  ఒకవేళ పిటిషనర్లకు పోలీసుల అరెస్ట్ పట్ల నిజంగానే భయం లేదా ఆందోళన ఉంటే, వారు చట్టబద్ధంగా  యాంటిసిపేటరీ బెయిల్   న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది

. ఈ వ్యవహారంలో సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల29కి వాయిదా వేసింది. ఇలా ఉండగా పరారీలో ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. 

Tammineni Sitaram, AP High Court, Srikakulam land grabbing case, Tammineni Chiranjeevi Nag, FIR quash petition

By
en-us Political News

  
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దుల భద్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్ కేసు మరువకముందే..అలాంటి తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
కూకట్‌పల్లిలో టిప్పర్ ఢీకొని యువకుల దుర్మరణం..!
రాజకీయ ప్రవేశంపై కాక్రోచ్ జనతా పార్టీ క్లారిటీ..!
నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు వద్ద ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది.
ధరణి పోర్టల్‌లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలు, సాంకేతిక లోపాలు, ప్రభుత్వానికి జరిగిన రెవెన్యూ నష్టంపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన భారత కేంద్రమంత్రుల చరిత్ర..!
దేశరాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.