రాహుల్ తో భేటీ: మోడీతో మెట్రో ప్రయాణం: మాస్టర్ ప్లానా.. రెండు పడవల ప్రయాణమా.?

Publish Date:Oct 12, 2026

Advertisement

తమిళనాడు రాజకీయాలలో ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది. వరుస రోజుల్లో చోటుచేసుకున్న ఈ రెండు కీలక పరిణామాలు రాష్ట్ర,  జాతీయ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలకు దారితీస్తాయనే అంశంపై పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.   ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో చెన్నైలో జరిగిన భేటీలు   ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నివాసంలో సమావేశమై సుమారు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి ఒక కేఫ్‌కు వెళ్లి అల్పాహారం తిని, కాఫీ తాగారు. ఇందుకు సంబంధించిన  ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ సమావేశంలో వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటన్నది పూర్తిగా వెల్లడి కాలేదు. 

అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపడుతున్న నిరసనల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే చెన్నైలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నై పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూనమల్లి-వడపలని మెట్రో మార్గాన్ని ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్   పాల్గొని ప్రధానితో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. దాదాపు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలిసి కనిపించడం ప్రభుత్వ పరమైన సమన్వయంలో భాగమని పరిశీలకులు భావిస్తున్నారు. రాహుల్‌తో రాజకీయ చర్చలు జరిపిన మరుసటి రోజే ప్రధాని మోదీతో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం విజయ్ అనుసరిస్తున్న   విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది.   

కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్న విజయ్ పార్టీ తಮಿళ వెట్రి కజగం   భవిష్యత్తులో ఏ రాజకీయ కూటమితో నడుస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీలతో సంబంధాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. కేవలం ఒక సమావేశం ఆధారంగా భవిష్యత్ రాజకీయ నిర్ణయాలను అంచనా వేయడం సాధ్యం కాదంటున్నారు.

   రాష్ట్ర ప్రయోజనాల సాధనలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ఎంత ముఖ్యమో, రాజకీయంగా స్వతంత్ర వైఖరిని ప్రదర్శించడం కూడా అంతే కీలకమని   అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు  కేంద్రంతో   సహకరిస్తూనే, విధానపరమైన అంశాలపై తమ స్వరాన్ని వినిపించే దిశగా విజయ్   అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ సమక్షంలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులపై విజయ్ గళమొత్తడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. 

ఏది ఏమైనప్పటికీ, రాహుల్ గాంధీతో స్నేహపూర్వక భేటీ,  ప్రధాని మోదీతో మెట్రో ప్రయాణం వంటి పరిణామాలు విజయ్ మాస్టర్ ప్లాన్‌లో భాగమని భావించాల్సి ఉంటుంది.   భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర మరింత కీలకం కానున్న తరుణంలో, విజయ్ అనుసరిస్తున్న వ్యూహం ఆసక్తిగా మారింది.  కాంగ్రెస్‌తో రాజకీయ సహకారం వైపు అడుగులు వేస్తారా లేక అన్ని పార్టీలతోనూ సమదూరం పాటిస్తూ స్వతంత్ర రాజకీయాలను కొనసాగిస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

[Tamil Nadu Chief Minister Vijay Master Plan, Rahul Gandhi Meeting, Narendra Modi Metro Travel, Tamilaga Vettri Kazhagam, Chennai Metro, Telugu One]

By
en-us Political News

  
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.