ఢిల్లీని వదిలి ఎవరూ వెళ్లొద్దు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ ఆదేశాలు.!

Publish Date:Oct 12, 2026

Advertisement

జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు అక్టోబర్ 11 రాత్రి లేదా అక్టోబర్ 12 ఉదయం నాటికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు  ముఖ్య నేతలందరూ ఢిల్లీకి చేరుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా, అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఢిల్లీ కేంద్రంగా భారీ నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడాన్ని అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని ఆదేశించారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, తాము తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఎవరూ కూడా ఢిల్లీని విడిచి హైదరాబాద్ లేదా సొంత ప్రాంతాలకు వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నా ఆందోళనల్లో తెలంగాణ నుంచి తరలివెళ్లిన ప్రతి నాయకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తేల్చిచెప్పారు. ముఖ్యంగా ఎన్నికల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన లోపాలను, ప్రజాస్వామ్య హాలాన్ని కాపాడుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళనల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సమష్టి కృషితో కేంద్రంపై పోరాటం ఉద్ధృతం చేయాలని, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం దేశ రాజధాని వేదికగా గళం వినిపించడంలో ప్రతి నాయకుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గోవా పర్యటనను ముగించుకుని నేరుగా ఢిల్లీకి చేరుకుని ఈ ఆందోళనల్లో పాల్గొనడం విశేషం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు  సీనియర్ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేయకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ తదుపరి సూచనలు వచ్చే వరకు ఢిల్లీ కేంద్రంగానే ఉండి పార్టీ కార్యాచరణను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

 

 

[ CM Revanth Reddy, Mahesh Kumar Goud, Telangana Congress, Delhi Protests, KC Venugopal, AICC Delhi Rally, Rahul Gandhi, Election Commission of India, Special Intensive Revision, Supreme Court, CEC Gyanesh Kumar ]

By
en-us Political News

  
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.