ఏసీబీ వల: రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారుల పట్టివేత.!

Publish Date:Nov 5, 2026

Advertisement

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించారు. మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా పట్టుబడ్డారు. గురువారం నిర్వహించిన ఈ దాడిలో జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి (AO-1), అదే కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టైపిస్టుగా పనిచేస్తున్న శ్రీ గోరె ఉమేష్ (AO-2) ఏసీబీ అధికారులకు చిక్కారు. 

మహబూబ్‌నగర్‌లోని ఎస్‌ఏటీజీ వాలీబాల్ హాస్టల్‌లో ఉంటున్న క్రీడాకారులకు ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 2026 నెలకు సంబంధించిన రూ.3.10 లక్షల క్యాటరింగ్ బిల్లు ప్రాసెస్ చేసి, చెక్కు విడుదల చేయించేం దుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష ఇవ్వాలని కోరినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఈ క్రమంలో లంచం సొమ్మును స్వీకరిస్తుండగా ఏసీబీ మహబూబ్‌నగర్ రేంజ్ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.లక్ష నగదును ప్రధాన నిందితుడు జక్కు రాజశేఖర్ రెడ్డి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెండో నిందితుడిని కూడా అరెస్టు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారనే అభియోగాలపై ఇద్దరినీ అరెస్టు చేసి, నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. 

ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను రహస్యంగా ఉంచుతామని ఏసీబీ భరోసా ఇచ్చింది.

 

 

 

[ Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News ]

By
en-us Political News

  
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.