పరారీలో బండి బగీరథ్.. ఓ వైపు కోర్టులో విచారణ.. మరో వైపు పోలీసుల గాలింపు

Publish Date:May 15, 2026

Advertisement

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణలో రాజకీయంగాను, న్యాయపరంగాను పెను సంచలనం రేపుతోంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ బండి బగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ ను   గురువారం (మే 14) విచారించిన తెలంగాణ హైకోర్టు  తీర్పు శుక్రవారానికి (మే 15)కు వాయిదా వేసింది. 

ఈ కేసు వివరాల్లోకి వెళితే..   మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పెట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తరపున కోర్టులో వాదించిన న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు.   రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆయన వాదించారు.  తమ క్లయింట్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కేవలం అరెస్టు నుంచి రక్షణ మాత్రమే కోరుతున్నామని తెలిపారు. అయితే ఆ వాదనను ప్రభుత్వం, బాధితురాలి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. పరారీలో ఉంటూ అరెస్టు నుంచి రక్షణ కోరడం సరికాదని వారు కోర్టుకు తెలిపారు. 

అదలా ఉంటే పరారీలో ఉన్న బండి బగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.  హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్‌లలో ప్రత్యేక బృందాలు ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.  అలాగే బాధితురాలి వయసు నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నేపథ్యంలో బాధితురాలి గుర్తింపును బయటపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

By
en-us Political News

  
మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని రన్‌వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్‌ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది.
హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్ మధ్య కీలక మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్షదీప్ తిలక్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమర్యాదగా సంబోధించారు. పంజాబ్ కింగ్స్ కు అత్యంత కీలకమైన మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఈ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్ బ్యాటర్ తిలక్ వర్మ 75 నాటౌట్ తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో జనగణన పూర్తయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ నగరాల ప్రతిపాదనలపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది.. కానీ జనగణన కారణంగా పక్కన పెట్టారు.
జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగులను వర్చువల్‌గా నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్యనే ఉంచాలని నిర్ణయించింది.
సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కమిటీ బాధితుల వివరాలను పరిశీలించి, సకాలంలో వారికి చెల్లింపులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
దేశవ్యాప్త విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన పరీక్షల్లో ఇటువంటి అవకతవకలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.
ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.