సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరగదు : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 20, 2026

Advertisement

 

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కేలు) ఏర్పాటు చేస్తున్నామని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాదని స్పష్టం చేశారు.

రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ... పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా సేవలు మరింత సులభతరం అవుతాయని, ప్రజల్లో అపోహలు తొలగించే బాధ్యత అధికారులదేనని సూచించారు.

డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం. వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. దీపం-2.0 లబ్ధిదారులకు సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని పౌర సరఫరాల, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.

సమీక్షలో లిటిగెంట్ పిటిషనర్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రజా ప్రయోజనం లేకుండా వరుసగా ఫిర్యాదులు చేసే వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనం ఉన్న ఫిర్యాదులను మాత్రమే ప్రాధాన్యంతో పరిశీలించాలని సూచించారు.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం 49 శాతం లోటుగా ఉందని పేర్కొన్న సీఎం... రైతులను డ్రై క్రాప్స్ వైపు ప్రోత్సహించాలని, ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వీబీజీ–రామ్‌జీ, జలధార పనులను సమన్వయంతో చేపట్టాలని సూచించారు.

ప్రజాభిప్రాయాలను నిరంతరం తెలుసుకుంటూ పరిపాలనను మెరుగుపరచాలని, సమస్యలు తలెత్తిన తర్వాత కాకుండా ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకునే విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు

Sub-Registrar Offices, No Privatization, False Propaganda, RSC, Citizen-Centric Services,
Passport Seva Kendra Model, Easier Registration Process,Document Writers, RTGS Review
CM N. Chandrababu Naidu, Litigant Petitioners
 

By
en-us Political News

  
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి రాసే నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.