ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేశామంటూ ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా నిర్ద్వంద్వంగా ఖండాంచింది. అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన ఈ సముద్ర మార్గాన్ని తాము పూర్తిగా మూసివేశామన్న ఇరాన్ ప్రచారాన్ని నమ్మవద్దన్న అగ్రరాజ్యం.. హర్మూజ్ జలసంధి మూతపడలేదని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ జలమార్గం సురక్షితంగా తెరిచే ఉందని ప్రకటించింది.
అమెరికా బలగాలు ఈ మార్గంలో నౌకల రక్షణ కోసం నిరంతరం పహారా కాస్తున్నాయని పేర్కొంది. దీని వల్ల ఈ మార్గం గుండా వాణిజ్యం నౌకల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదని అమెరికా ఆర్మీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను కూడా వెల్లడించింది. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు అమెరికా సైనిక బలగాలు వెయ్యికి పైగా వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటేందుకు సహాయ సహకారాలు అందించాయని సెంట్కామ్ ప్రకటించింది.
ఈ వెయ్యి నౌకల ద్వారా ప్రపంచవ్యాప్త ఇంధన అవసరాల కోసం 50 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయిందని పేర్కొంది. అంతర్జాతీయ జలమార్గాలను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఇష్టారీతిన మూసివేసే లేదా అడ్డుకునే ఎలాంటి చట్టబద్ధమైన అధికారం ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్‌కు ఇసుమంతైనా లేదని సెంట్కామ్ కుండబద్దలు కొట్టినట్లు పేర్కొంది. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
అంతర్జాతీయ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్య భద్రతకు పూర్తి భరోసా ఇస్తూనే.. ఇరాన్ నౌకాశ్రయాలపై తమ దేశం విధించిన ఆంక్షలను అమెరికా అమలు చేస్తోంది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రయాణించేందుకు ప్రయత్నించిన నౌకలపై అమెరికా నౌకాదళం ఉక్కుపాదం మోపింది. జులై చివరినాటికి అంతర్జాతీయ నిబంధనలను ధిక్కరించిన 30 వాణిజ్య నౌకలను అమెరికా నౌకాదళం దారి మళ్లించింది.
Strait of Hormuz, US Central Command, CENTCOM Iran news, Crude oil transport, Persian Gulf security, US Navy ships protection
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/strait-of-hormuz-36-228036.html
గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
ఈ సోదాలు బీహార్ కు చెందిన ప్రత్యేక ఈడీ బృందం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్, విశాఖలో మళ్ల విజయప్రసాద్ కు చెందిన నివాసాలు, వ్యాపార ప్రాంగణాలు, అనుబంధ కార్యాలయాలలో ఈడీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు.
దాడికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సేకరించాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా పంజాబ్‌లోని కీలకమైన పోలీస్ స్టేషన్లు, పోలీస్ భవనాలు, సిబ్బందిపై నిరంతరం రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ నిందితులకే అప్పగించారు. మరోవైపు అమృత్సర్ ప్రాంతంలో రైల్వే పట్టాల సమీపంలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చిన వ్యవహారంపై తనిఖీలు చేపట్టగా రెండో ఉగ్ర మాడ్యూల్ బయటపడింది.
947లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన ఇండియా.. ఈ ఏడాది 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాసచుసెట్స్ లో పంద్రాగస్టును ఇండియా డేగా జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు
మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతిపై మంగళవారం ) ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు కస్టడీ గడువు ముగియడంతో అదే రోజు సాయంతరం అంపోలు జైలుకు తిరిగి తరలించారు.
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!