నరసన్నపేటలో అన్నదమ్ముల సవాల్

Publish Date:Apr 3, 2012

Advertisement

శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ధర్మాన కుటుంబం నేడు కుటుంబ కలహాలతో సతమతమవుతోంది. ఈ జిల్లానుంచి ఎన్నికయిన ధర్మాన ప్రసాదరావు మంత్రిగా కొనసాగుతుండగా ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయి తాజా మాజీగా మారారు. వైయస్ మరణానంతరం జగన్ సొంత కుంపటి పెట్టడంతో ఎమ్మెల్యే కృష్ణదాస్ ఆయన పంచన చెరి అనర్హత వేటుకు గురయ్యారు. అక్కడినుంచే వీరి కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన మరో సోదరుడు రామ్ దాస్ రంగలో నిలబడ్డారు.

కుటుంబంలో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన రామ్ దాస్ ఒక వర్గంగా ఏర్పడ్డారు. మరోవైపు వీరి అన్నగారైన ధర్మాన కృష్ణదాస్ వీరికి వ్యతిరేకంగా మారారు. దీంతో నరసన్నపేట ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ధర్మాన కృష్ణదాస్ నిత్యం తన సోదరుడు, మంత్రి అయిన ధర్మాన ప్రసాద రావుపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రసాదరావి రాజకీయంగా తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, తన సహచరులను బెదిరిస్తున్నాడని తన ఓటమికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నాడని కృష్ణదాస్ ఆరోపిస్తున్నాడు. తాజాగా తనముందు ధర్మాన ప్రసాదరావు బచ్చాగాడని, అతనికి రాజకీయ భిక్ష పెట్టింది తానేనని కృష్ణదాస్ ప్రకటించాడు. ఒకవైపు అన్నగారు తనపై ఒంటికాలిపై వస్తున్నా తమ్ముల్లిద్దరూ మాత్రం నిగ్రహంతో వ్యవహరిస్తుండటం విశేషం.

By
en-us Political News

  
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.