ఏపీలో ఆగని కరోనా వ్యాప్తి.!

Publish Date:Jul 25, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో  కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.  కొత్తగా ఏడుగురికి కరోనా సోకటంతో మొత్తం కేసుల సంఖ్య 39కి పెరిగింది.   దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులందరినీ   ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి తగిన చికిత్స అందిస్తున్నది. 

వైరస్  వ్యాప్తి వేగాన్ని అరికట్టుందుకు   ఆరోగ్య శాఖ సిబ్బంది  యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన వారితో నేరుగా సంబంధం కలిగి ఉన్న ప్రాథమిక కాంటాక్ట్‌లను  గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. బాధితులు ఇటీవల కాలంలో ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి ప్రయాణించారు అనే సమాచారాన్ని సేకరించి, వారిని కూడా వెంటనే హోమ్ ఐసోలేషన్ కు పంపుతున్నారు.  వైరస్ తీవ్రత సకాలంలో అదుపులోకి రావాలంటే బాధితుల కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత కీలకమని భావించిన అధికారులు, ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టారు. 

రాష్ట్రంలో మళ్లీ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు   పరిస్థితిని సమీక్షించి  ప్రతి జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు  మొదలుకొని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల వరకు ప్రత్యేక కరోనా వార్డులను సిద్ధం చేయాలని   మార్గదర్శకాలు జారీ చేశారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు  కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. మందుల కొరత లేకుండా చూడటంతో పాటు ఆక్సిజన్ నిల్వలు,   వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రుల నిర్వహణ వర్గాలను ఆదేశించారు.   

ap corona cases, andhra pradesh covid updates, ap health department news, active covid cases

By
en-us Political News

  
వానకాలం ఖరీఫ్ సీజన్ సగం గడుస్తున్నప్పటికీ వర్షభావ పరిస్థితుల కారణంగా సాగు రంగం సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారికి క్రాప్ హాలీడే యే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం కారణంగా ఈ సీజన్ సాగుకు తిలోదకాలు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు భారత్ వేదిక కాబోతోందా? చెన్నైలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ వెల్లడించిన క్రేజీ ప్లాన్స్, లాజిస్టికల్ సవాళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ దిగ్గజం బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్, వార్‌బర్గ్ పింకస్ నుండి ఇండియాఫస్ట్ లైఫ్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. సుమారు ₹10,000 కోట్ల విలువైన ఈ బిగ్ ఇన్సూరెన్స్ డీల్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వాటా వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఓపెన్ ఏఐ రక్షణ సరిహద్దులను దాటుకుని హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫామ్‌పై మానవ ప్రమేయం లేకుండా దాడి చేసిన ఏఐ మోడల్. సైన్స్ ఫిక్షన్ వంటి ఈ విపరీతమైన సైబర్ దాడి వెనుక ఉన్న పూర్తి వివరాలు మరియు సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరికల గురించి తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ GenPage , అమెజాన్ ప్రైమ్ వీడియో Lighthouse ప్రాజెక్టులతో AI ఆధారిత హోమ్‌పేజీలను తీసుకువస్తున్నాయి. కానీ యూజర్లు ఈ మార్పులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రింగ్‌కాన్ Gen 3 స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి లాంచ్ అయింది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ స్పెషల్ టై ఇన్, 14 రోజుల బ్యాటరీ లైఫ్, సబ్‌స్క్రిప్షన్ ఉచిత హెల్త్ డేటా మరియు ప్రతి 2 సెకన్ల SpO2 ట్రాకింగ్ ఫీచర్లతో $349 ధరకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు చదవండి.
గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ AGI ఆవిష్కరణ మరియు దాని వల్ల రాబోయే తీవ్రమైన సైబర్, న్యూక్లియర్ భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు. AGI మానవాళి భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఈ కథనంలో తెలుసుకోండి.
దక్షిణ కొరియా రూపొందించిన 15,000 TEU అణుశక్తి ఆధారిత కార్గో నౌక డిజైన్‌కు అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్ గుర్తింపు లభించింది. జంట మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లు MSR మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ నౌక, సముద్ర వాణిజ్యంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో మరియు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషించనుంది.
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి ట్రంప్ టారిఫ్‌లు, క్రూడ్ ఆయిల్ ధరల పెంపే కారణమా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
సిద్దిపేటలో అండర్ 13, అండర్ 15 బ్యాడ్మింటన్ టోర్నీని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘనంగా ప్రారంభించారు. సిద్దిపేటను స్పోర్ట్స్ హబ్‌గా మార్చే కల, రూ. 11.50 కోట్ల స్టేడియం నిధుల రద్దుపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు మీకోసం!
జింబాబ్వేతో జరగనున్న రెండో టీ20లో సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. తుది జట్టులో ఊహించని మార్పులు, వైభవ్ సూర్యవంశీ రికార్డు ఇన్నింగ్స్, పిచ్ నివేదిక మరియు సమగ్ర వివరాలు తెలుసుకోండి.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ద్రవాహారం తీసుకుని దీక్ష ముగించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలను ఖండించిన ఆయన..   ప్రభుత్వం ఇచ్చిన  హామీలను పరిగణనలోకి తీసుకుని   దీక్ష విరమించానని, ఇందులో ఎలాంటి  బ్యాక్ డోర్ ఒప్పందాలూ లేవని కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.