షావుకారు జానకి మృతి పట్ల ..సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం..!
Publish Date:Aug 21, 2026
Advertisement
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. షావుకారు జానకి మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆమె భౌతికంగా దూరమైనా.. తన నటన, పాత్రల ద్వారా ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. షావుకారు జానకి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కళారంగంలోకి అడుగుపెట్టిన షావుకారు జానకి.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ‘షావుకారు’ చిత్రంలో అద్భుతమైన నటనతో ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందారని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించడంతో పాటు హిందీ, మలయాళ చిత్రాల్లోనూ తన ప్రతిభను చాటారని గుర్తుచేశారు. ఆమె పోషించిన ఎన్నో పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రేవంత్ రెడ్డి అన్నారు. చలనచిత్ర రంగానికి షావుకారు జానకి లేని లోటు పూడ్చలేనిదని పేర్కొంటూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. Sowcar Janaki, Tollywood actress, Sowcar Janaki passes away, Padma Shri Sowcar Janaki, Veteran Telugu actress,South Indian cinema legend, CM Chandrababu, CM Revanth reddy
http://www.teluguone.com/news/content/sowcar-janaki-36-229481.html





