వైసీపీ నేత ఘరానా మోసం.. చిట్టీల పేర రూ.70లక్షలకు కుచ్చుటోపీ.!

Publish Date:Aug 21, 2026

Advertisement

చిట్టీల పేరుతో నిరుపేదలను, రెక్కాడితే కానీ డొక్కాడని మత్యకారులను నిలువునా మోసం చేసిన ఉదంతమింది.  వైసీపీ సీనియర్ నాయుడు, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడే ఈ మోసానికి పాల్పడ్డాడు. రెండు దశాబ్దాలుగా గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల వ్యాపారం చేస్తున్న మండాది శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులు స్థానక మత్స్యకారులు కాయకష్టం చేసి కట్టిన చిట్టీల సొమ్ము ఎగవేశారు.

అదేంటని అడిగిన వారిపై దౌర్జన్యాలు, బెదరింపులకు దిగారు. చిట్టీల పేరుతో మోసం చేసిన సొమ్ములతో  విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో కోట్ల ఆస్తులు కూడబెట్టారు. వీరి నిర్వాకంపై గత నెల 31న గుడివాడ వన్ టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. చివరకు  పోలీసులు కేసు నమోదు చేయడంతో తెగించేసిన మండా శ్రీనివాసరావు దంపతులు.. ఐపీ పెట్టేశారు. ఈ మేరకు 28 మంది బాధితులకు  ఐపీ నోటీసులు  ఇచ్చి పైసా కూడా ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు.

  ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసేందుకు ప్రయత్నించిన మండాది శ్రీనివాసరావు దంపతులను బాధితులు అడ్డగించి పోలీసులకు అప్పగించారు.   పేదల కష్టార్జితమైన రూ.70 లక్షల మొత్తంతో నిర్వాహకులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ అండదండలతోనే ఈ దందాను సాగించారని బాధితులు ఆరోపిస్తున్నారు, తమ సొమ్ముతమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.  ఇలా ఉండగా.. పోలీసుల మండాది శ్రీనివాసరావు దంపతులపై  51.79 లక్ష రూపాయల ఎగవేతపై చీటింగ్ కేసు నమోదు చేశారు. చిట్టీల పేరుతో మోసం చేస్తే ఐపీ చెల్లదని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేశామనీ, విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామనీ హామీ ఇచ్చారు.  

YCp leader chitti  scam in Gudiwada, 70 lakhs fraud, Kodali Nani associat, Gudivada NTR colony, Andhra Pradesh, TeluguOne

By
en-us Political News

  
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు 11 21, 21 15, 17 21తో వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, సాత్విక్ చిరాగ్ మరియు ట్రీసా గాయత్రి జోడీలు సంచలన విజయాలతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. తదుపరి మ్యాచ్ వివరాలు ఇవే
ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ 12 0 తేడాతో రోవర్స్‌‌ ఎఫ్‌‌సీపై చారిత్రాత్మక విజయం సాధించింది. 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆసియా పోటీల్లో ఇండియన్ క్లబ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే!
మేటా స్మార్ట్ గ్లాసెస్‌పై UK సినిమా థియేటర్లలో నిషేధం విధించే ఆలోచన మొదలైంది. ప్రైవసీ ఆందోళనలతో పాటు రహస్యంగా సినిమాలు రికార్డు చేసి పైరసీ చేసే ప్రమాదం ఉండటంతో ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
ది బిగ్ బ్యాంగ్ థియరీ పాపులర్ స్పిన్ ఆఫ్ సిరీస్ స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ సీజన్ 2 పై క్రియేటర్స్ చక్ లోరే, జాక్ పెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షో భవిష్యత్తు ప్రణాళికలు మరియు HBO Max నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రపంచ దిగ్గజ సంస్థలైన సిస్కో, శామ్‌సంగ్, AWS లను వణికించిన భారీ సప్లై చైన్ సైబర్ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. LiteLLM టూల్ ద్వారా 2,500 కి పైగా కంపెనీల రహస్య క్లౌడ్ డేటా, కీలు ఎలా లీక్ అయ్యాయో చూడండి.
ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ ఇప్పుడు హౌస్ ఆఫ్ ఏసర్గా అవతరిస్తోంది. ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా అక్షయ్ కుమార్‌ను అంబాసిడర్‌గా పెట్టి గృహోపకరణాలు, లగేజ్, టీవీలు, స్మార్ట్ రింగ్స్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ గాజా క్యాపిటల్ ఐపీఓ చివరి రోజు నాటికి 2.52 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. జీఎమ్‌పి, లిస్టింగ్ గెయిన్స్, లాట్ సైజు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ పూర్తి సమాచారం తెలుసుకోండి.
రంగారెడ్డి జిల్లా ఎమ్మార్వో దేశం శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 100 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూశాయి. కేజీకి పైగా బంగారం, స్థలాలు, భవనాలు మరియు బార్‌లో పెట్టుబడులకు సంబంధించిన విస్తుపోయే నిజాలు ఈ కథనంలో చదవండి.
భారతదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తామని ఎలన్ మస్క్ హామీ ఇచ్చారు. 11 వేలకు పైగా గ్రామాల్లో 4G నెట్‌వర్క్ లేని పరిస్థితుల్లో, స్పేస్‌ఎక్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మరియు భారతీయ నిబంధనల సవాళ్లపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై అప్లైడ్ ఏఐ స్టూడియో ఫౌండర్ బాల పన్నీర్ సెల్వం చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 17 కిలోమీటర్లకు 2 గంటల సమయం పడుతోందని, ఉద్యోగుల ప్రయాణ నరకంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీకి నెయ్యి సరఫరా విషయంలో సజ్జల తమ సంస్థ సంగం డెయిరీపై   అసత్య ఆరోపణలు చేశారంటూ 10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసింది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు న్యాయస్థానంలో సంగం డెయిరీ యాజమాన్యం ఈ మేరకు  పిటిషన్ దాఖలు చేసింది.
వైఎస్ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాలు, అలాగే ఆయన ముఖ్య అనుచరుల నివాసాలలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌,   కడప, పులివెందులలోని  ప్రాంతాల్లో దాదాపు 10 ప్రదేశాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలను చేపట్టాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.