Publish Date:Apr 29, 2022
ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. మంచి సంబంధం అనుకొని పెళ్లి చేశారు. కట్నం, బంగారం భారీగానే ముట్ట జెప్పారు. త్రీ మంత్స్ హ్యాపీ. దెన్ స్టార్టెడ్ ప్రాబ్లమ్స్. వాడు మొగుడు కాదు డబ్బు పిశాచి అని ఆలస్యంగా తెలిసొచ్చింది. అదనపు కట్నం కోసం నిత్యం భార్యను టార్చర్ చేసేవాడు. మామ ఆస్తిలో సగం రాసివ్వాలంటూ గొడవ గొడవ చేసేవాడు. ఆ శాడిస్ట్ మొగుడి టార్చర్ పడలేక.. పుట్టింటికి వచ్చేసింది ఆ భార్య. అయినా, వదిలిపెట్టలేదు. ఫోన్ చేసి బూతులు తిట్టేవాడు. ఫోన్ ఎత్తకపోతే.. ఆమె చెల్లెలికి కాల్ చేసి సతాయించేవాడు. ఓ రోజు నేరుగా భార్య ఇంటికి వచ్చాడు. ఆస్థి కోసం మళ్లీ తిట్టి.. కొట్టి.. పుస్తెల తాడు తెంచేశాడు. ఇక వీడు మారడు.. వీడితో పడలేను అనుకుంది ఆ అభాగ్యురాలు. భర్త వెళ్లిపోగానే బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఆ ఆత్మహత్య.. సిరిసిల్లలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ సైకో భర్త ఇంటిముందు ఆందోళన చేశారు మృతురాలి బంధువులు. కేటీఆర్ ఇలాఖాలో జరిగిన ఈ దారుణం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల జోక్యంతో కేసు మరో మలుపు తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే....
సిరిసిల్లకు చెందిన జూపల్లి శ్రీనివాసరావు.. హైదరాబాద్ కూకట్‌పల్లిలో సెటిల్ అయ్యారు. ఇద్దరు కుమార్తెలు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న పెద్ద కూతురు నిఖితకు సిరిసిల్లకే చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చేటి ఉదయ్‌తో గతేడాది జూన్‌లో పెళ్లైంది. 10 లక్షలు క్యాష్, 35 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే, శ్రీనివాసరావుకు సొంతూరులో 4.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అందులో సగం భూమిని తనకు ఇవ్వాలంటూ భర్త ఉదయ్.. భార్య నిఖితను వేధిస్తున్నాడు. సగం భూమి ఇచ్చేందుకు శ్రీనివాసరావు ఒప్పుకోవడం లేదు. తమ మరణానంతరం ఆస్తి ఇద్దరు కూతుర్లకు చెరిసగం అని చెబుతున్నాడు. కానీ, ఉదయ్ మాత్రం ఇప్పుడే ఆస్థి పంచి ఇచ్చేయాలని పట్టుబట్టేవాడు. లేదంటే, అదనపు కట్నం కావాలంటూ భార్యను టార్చర్ చేసేవాడు. దీంతో శ్రీనివాసరావు ఇటీవల అల్లుడికి మరో రూ.10 లక్షలు ఇచ్చారు. అయినా ఉదయ్ వేధింపులు ఆగలేదు. నిఖిత అత్తమామలైన అశోక్‌రావు, శ్యామల, మరిది ఉపేందర్ సైతం ఉదయ్‌కే వంత పాడుతుండటంతో నిఖిత ఈ ఉగాది రోజున (ఏప్రిల్ 2న) కూకట్‌పల్లిలోని పుట్టింటికి వచ్చేసింది. అయినా రోజూ ఫోన్‌లో భార్యను వేధించేవాడు భర్త. ఫోన్ తీయకపోతే ఆమె సోదరి నీతకు ఫోన్ చేసి తిట్టేవాడు. మామూలుగా ఉండకపోయేది వాడి టార్చర్ అంటున్నారు.
ఇక, ఇటీవల నిఖిత ఇంటికి వచ్చిన ఉదయ్ పెద్ద గొడవ చేశాడు. భార్యాభర్తలకు తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. భార్య మెడలోని మంగళసూత్రాన్ని తెంపి నేలకేసి కొట్టాడు. నిఖితను తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు. ఉదయ్ వేధింపులు భరించలేకపోయిన నిఖిత మనస్తాపం చెంది.. బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి 10 దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి ఉంది.
నిఖిత ఆత్మహత్యకు కారణమైన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు సిరిసిల్లలోని ఉదయ్ ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేశారు. సిరిసిల్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/software-employee-sucide-with-her-husband-tarcher-25-135217.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.