ఆమెకి పెద్దల టికెట్!.. జగన్ బిగ్ స్కెచ్!

Publish Date:Apr 29, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్’ లో ఒకేసారి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర శాసన సభలో ఉన్నసంఖ్యాబలం కారణంగా ఈ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదలా ఉంటే,ఈ నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఒక సీటు, బిజినెస్ కోటాలో, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ భార్య ప్రీతి అదానీకి రిజర్వు అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ విషయాన్ని కూడా ఢిల్లీ పెద్దలతో చర్చింఛి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఇదే బిజినెస్ కోటాలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి సన్నిహితుడు, రిలయన్స్‌ సంస్థల వైస్‌ప్రెసిడెంట్‌ పరిమళ్‌ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు అదే విధంగా మరో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ భార్య ప్రీతి అదానీని రాజ్య సభకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. 

అదలా ఉంటే, వైసీపీపీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం జూన్‌ మొదటివారంలో ముగుస్తోంది.ఆయనకు రెండోసారి కూడా అవకాశమిచ్చేందుకు జగన్ రెడ్డి సుముఖంగా లేరని సమాచారం. అయితే, మాయల పకీరు ప్రాణం చెట్టు తొర్రలో ఉన్నట్లు, జగన్ రెడ్డి గుట్టుమట్లన్నీ  విజయసాయి గుప్పిట్లో ఉన్నాయని, అందువలన చేత పార్టీ పునర్వ్యవస్తీకరణలో ప్రయోగించిన, ‘బ్లాక్ మెయిల్’ అస్త్రాన్ని విజయ సాయి మళ్ళీ  ప్రయోగిస్తే ముఖ్యమంత్రి ఏమి చేస్తారనేది అనుమానమే అంటున్నారు. 

విజయసాయి వ్యవహారం ఎలా ఉన్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరిని, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరినీ పెద్దల సభకు పంపాలనే నిర్ణయానికి వచ్చారని, పార్టీ వర్గాల సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బీర మస్తాన్ రావు, డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలొ ఒకరికి  రాజ్య సభ టికెట్ ఖాయమని అంటున్నారు. అలాగే, ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో కమ్మ సామాజిక వర్గానికి మొండి చేయి చూపించి, విమర్శలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి, చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్’కు రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని,అంటున్నారు. నిజానికి జగన్ రెడ్డి తెలుగు దేశం పార్టీనుంచి వచ్చిన విడదల రజనీని చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించిన సమయంలోనే, రాజశేఖర్’ కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ప్రామిస్ చేశారు. అయితే, ఆతర్వాత అలవాటులో పొరపాటుగా, మాట తప్పారు. మడమ తిప్పారు. ఇప్పుడు, రాజకీయ అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చి, కమ్మ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే అలోచన చేస్తున్నారని అంటున్నారు. 
 
మరోవంక వైసీపీలో సహజంగానే, పైసా ఖర్చు లేకుద్న పెద్దల సభకు వెళ్ళే అద్భుత అవకాశం కోసం సజ్జల సహా చాలా  మందేపోటీ పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత న్యాయవాది నిరంజన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇంకా మరి కొందరు కూడా రేసులో ఉన్నారని అంటున్నారు.అదే సమయంలో, ఎవరూ ఉహించని పేర్లు ఉన్నా ఆశ్చర్య పోనవసరం లేదని, అంటున్నారు.
 

By
en-us Political News

  
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.