తెలంగాణ సీఎం పోస్టు ఖాళీగా ఉందా.. కోమటిరెడ్డి వ్యాఖ్యల అర్ధం ఏంటి?

Publish Date:Sep 3, 2026

Advertisement

తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉందా? లేక ఖాళీ అవ్వబోతోందా? అన్న అనుమానాలు రేకెత్తేలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన తాజాగా తాను తెలంగాణ సీఎం కావడం ఖాయం, దానిని ఎవరూ అడ్డుకోలేరంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతే కాకుండా ఆయన వ్యాఖ్యలు తెలంగాణ అధికార కాంగ్రెస్ లో  అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్నీ బహిర్గతం చేశాయి. 

దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  తమ కుటుంబం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉందనీ,  పార్టీ కోసం కష్టపడిన అసలు సిసలైన నాయకులకు  గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందన్నారు.  అంతే కాకుండా  తాను   రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతానని, ఆ పదవిని తాను కచ్చితంగా చేపడతానని విస్పష్టంగా చెప్పారు.  ప్రజా సేవలో  శ్రమిస్తున్న తమ లాంటి నాయకులకు ప్రజల మద్దతు ఉన్నంతవరకు  పదవులు దక్కకుండా ఎవరూ అడ్డుకోలేరన్న కోమటిరెడ్డి..  తెలంగాణలో కొందరు నేతలు పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. 

గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సీఎం మార్పు చర్చల నేపథ్యంలో  రాజగోపాల్ రెడ్డి  వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో తొలి నుంచీ ఉన్న నాయకులు, మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి కీలక స్థానాలలో కొనసాగుతున్న నాయకుల మధ్య ఆధిపత్య పోరు అంటూ జరుగుతున్న ప్రచారానికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి.  సొంత పార్టీ నాయకత్వ శైలిని ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు  రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయి.

ఓ వైపు కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం చేశాయి.  రానున్నరోజులలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింత పెచ్చరిల్లే అవకాశాలున్నాయని పరిశీలకులు రాష్ట్ర పార్టీలో ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు.  

[Sensation in Telangana Politics, Komatireddy, CM Comments, Telangana CM, Telugu One]

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.