సోద‌రి అస్తిపంజ‌ర‌మే డెత్ స‌ర్టిఫికేట్!

Publish Date:Apr 29, 2026

Advertisement

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన అత్యంత బాధాకరమైనది. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఆ గిరిజన సోదరుడిది కేవ‌లం కథ కాదు. ఒక‌ దీన గాథ‌. కన్నీటి ఉప్పెన. కియోంఝర్ జిల్లా, పతానా బ్లాక్‌లోని దియనాలి గ్రామానికి చెందిన జీతూ ముండా అనే 50 ఏళ్ల‌ వ్యక్తి తన సోదరి అస్తిపంజరాన్ని సంచిలో వేసుకుని బ్యాంకుకు వెళ్లాడు. అలా ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో చూస్తే..

జీతూ ముండా సోదరి యాభై ఆరేళ్ల‌ కల్రా ముండా  ఈ ఏడాది జనవరి 26న మరణించారు. ఆమె పేరు మీద ఒడిశా గ్రామీణ బ్యాంక్, మాలిపాసి శాఖలో రూ.19,300 వరకు డ‌బ్బులున్నాయి. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి జీతూ చాలాసార్లు బ్యాంకు చుట్టూ తిరిగాడు. అయితే, నామినీగా ఉన్న వ్యక్తి కూడా అప్పటికే మరణించడంతో బ్యాంకు అధికారులు నిబంధనల ప్రకారం డెత్ సర్టిఫికేట్  లేదా  లీగల్ హెయిర్ అంటే, వారసత్వ ధృవీకరణ పత్రం అడిగారు.

బ్యాంకు అధికారులు తన సోదరి చనిపోయిందని నమ్మడం లేదనీ.. ఆమెను స్వయంగా తీసుకురావాలని అన్నారని అంటాడు జీతూ. అమాయకత్వం, చదువు లేకపోవడం, బ్యాంకు నిబంధనల పట్ల త‌గిన‌ అవగాహన లేకపోవడంతో.. తన సోదరి చనిపోయిందని నిరూపించడానికి ఆమె సమాధిని తవ్వి, అందులోని అస్తిపంజరాన్ని సంచిలో వేసుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు కాలినడకన చేరుకున్నాడు జీతూ. జీతూ అలా చేయ‌డంతో  బ్యాంకు సిబ్బంది, అక్క‌డున్న‌ ఖాతాదారులు ఒక్కసారిగా  ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే బ్యాంక్ స్టాఫ్ పోలీసుల‌కు స‌మాచార‌మందించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జీతూ ముండాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టపరమైన ప్రక్రియల గురించి వివరించారు.  ఆ అస్థికలను తిరిగి మర్యాదపూర్వకంగా ఖననం చేయించారు.  ప్రస్తుతం స్థానిక అధికారులు ఆ గిరిజనుడికి అవసరమైన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇతర పత్రాలు ఇప్పించి, బ్యాంకులో ఉన్న నగదు అతనికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి అమాయకత్వం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నిబంధనల పట్ల అవగాహన లోపానికి, అధికార యంత్రాంగం మొండితనానికి అద్దం పడుతోంది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన సర్టిఫికెట్లు పొందే ప్రక్రియ గిరిజనులకు ఎంత భారంగా మారుతుందో ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది. ఒక సోదరుడు తన సోదరి మరణాన్ని నిరూపించుకోవడానికి ఇంతటి సాహసం చేయాల్సి రావడం నిజంగా హృదయ విదారకంగా భావిస్తున్నారు.  

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడుకు హైటెక్ అనే పేరు ఊరికే రాలేదు. 90వ దశకంలోనే ఐటి ప్రాధాన్యతను గుర్తించి, చేతిలో ఒక పామ్ టాప్ పట్టుకుని తిరుగుతూ అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్ర‌బాబు. తాజాగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన ఫోన్ చూసి ఆశ్చర్యపోవడం, బాబు గారి అప్‌డేటెడ్ లైఫ్‌స్టైల్‌కు మరో నిదర్శనంగా చెబుతారు.
బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలకు గానూ 58 జిల్లాల్లో మీజిల్స్ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు 90 శాతం దేశం మీజిల్స్ ప్రభావానికి గురైంది. మార్చి మధ్య కాలం నుండి ప్రారంభమైన ఈ వ్యాప్తి ఉధృతి ఏప్రిల్ ఆఖరు నాటికి పతాక స్థాయికి చేరింది. సుమారు 30 వేల మందికి పైగా చిన్నారులు.. మీజిల్స్ లక్షణాలతో బాధపడుతుండగా, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
మెట్రో మొదటి దశ కార్యకలాపాల బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించే దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నాటికి ఈ బదలాయింపు ప్రక్రియ ముగియ నుంది. వచ్చే నెల 1 నుంచి అంటే శుక్రవారం నుంచీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలోకి 69.2 కిలోమీటర్ల నెట్‌వర్క్ రానుంది.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. తండ్రి సంజీవ్ ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు.. 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.
యూఏఈ తన ప్రయోజనాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన అవసరాలు మారుతున్న తరుణంలో.. క్లీన్ ఎనర్జీ తదితర ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధులను చమురు ఎగుమతుల ద్వారా గరిష్టంగా సంపాదించాలని చూస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. బేబీ బాస్ గా అభిమానులు పిలుచుకుంటున్న వైభవ్ సూర్యవంశీ పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు చాహల్ బ్రేక్ వేశాడు.
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు.
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది.
క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి .సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.