మైనర్ బాలిక మృతి కేసులో యువకుడి ఆత్మహత్య..!

Publish Date:Sep 1, 2026

Advertisement

 

హైదరాబాద్ చంపాపేట,సింగరేణి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక మృతి కేసులో జైలుకు వెళ్లి మూడు రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చిన మహేష్‌ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మైనర్ బాలిక మృతి కేసులో తనపై అనవసరంగా కేసులు పెట్టారని మహేష్‌ తీవ్ర ఆవేదనకు గురైనాడు. తనకు సంబంధం లేని వ్యవహారంలో కేసు నమోదు చేసి జైలుకు పంపించారని కుటుంబ సభ్యుల వద్ద పలుమార్లు బాధపడ్డాడు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా కేసు విషయాన్ని తలచుకుని మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైయ్యాడు. మానసిక ఒత్తిడిని భరించలేక మహేష్‌ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ నేపథ్యంలోనే మహేష్ ఆత్మహత్యకు ముందు తన తండ్రికి ఎస్ఎంఎస్‌ పంపించారు. మన మీద తప్పుడు కేసులు పెట్టారని, తన చావుకు కారణమైన ఎవరినీ వదిలిపెట్టొద్దంటూ తండ్రికి సందేశం పంపించి, అనంత రం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహేష్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహేష్‌ తండ్రికి పంపిన ఎస్ఎంఎస్‌ ఇప్పుడు కీలకంగా మారింది. 

అందులో పేర్కొ న్న అంశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలిక మృతి కేసులో తనపై అనవసరంగా కేసులు పెట్టారని మహేష్‌ ఎందుకు భావించాడు?  అతడి ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. అతడి ఫోన్‌లోని మెసేజ్‌లు, ఆత్మహత్యకు ముందు ఎవరితో మాట్లాడాడు, కుటుంబ సభ్యులకు ఏమైనా చెప్పాడా అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

Singareni Colony, Champapet, Hyderabad police, Crime news,  CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, Hyderabad police, Telugu One, Telugu news


 

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఫైర్..!
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.