జైలు నుంచి ఆస్పత్రికి ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సుప్రీం తీర్పు.!

Publish Date:Aug 19, 2026

Advertisement

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే జైలు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు  ఆ దేశ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  గత కొంతకాలంగా జైలులో ఉంటూ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న . ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, ఆయనకు సరైన వైద్య సహాయం అందడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన పాకిస్థాన్ సుప్రీం కోర్టు  ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని   షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి 48 గంటల్లోగా తరలించాల్సి ఉంటుంది. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా సుప్రీం కోర్టు తన తీర్పులో విస్పష్టంగా పేర్కొంది.  ఈ మెడికల్ బోర్డులో కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, నేత్ర వైద్య నిపుణులతో పాటు ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడిని కూడా భాగస్వామిగా చేర్చాలని సుప్రీం కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల  16కు వాయిదా వేసిన కోర్టు అంత వరకూ ఆయనను ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని స్పష్టం చేసింది.  

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మరియు ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సుప్రీం కోర్టు త్రిసభ్య  ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ షాహిద్ వహీద్ స్పష్టం చేశారు.  ఖైదీగా ఉన్న వ్యక్తి ఆరోగ్య భద్రతను నిర్ధారించేందుకే ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు  తెలిపారు. ఆస్పత్రిలో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆయనను కలిసేందుకు అనుమతించాలని ఆదేశించిన కోర్టు..  బ్రిటన్‌లో ఉన్న ఆయన కుమారులతో ఫోన్లో సంభాషించేందుకూ అనుమతించి, అందుకు అవసరమైన  చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది.

గత కొద్ది నెలలుగా ఇమ్రాన్ ఖాన్ కుడికంటి చూపు తీవ్రంగా మందగించిందనే కథనాలు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ఆయన కుడికంటిలో రక్తం గడ్డకట్టడం వల్ల దాదాపు 85 శాతం చూపు తగ్గిందని ఆయన కుటుంబ సభ్యులు, పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, అడియాలా జైలు అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో ఇమ్రాన్ ఖాన్‌కు నిపుణులైన వైద్యులతో తరచూ పరీక్షలు చేయిస్తున్నామని, ప్రస్తుతం ఆయన కంటిచూపు మెరుగుపడి సాధారణ స్థితికి వచ్చిందని పేర్కొన్నారు. అయితే జైలు నివేదికలపై పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ప్రైవేట్ ఆస్పత్రి తరలింపుకే మొగ్గుచూపింది.

అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలపై ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తెలిపారు.   సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల పీటీఐ పార్టీ నాయకులు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.  ఆస్పత్రి వద్ద ఎలాంటి నిరసనలు లేదా ఊరేగింపులు నిర్వహించవద్దని, ఇమ్రాన్ ఖాన్ కోలుకోవడానికి ప్రశాంత వాతావరణం అవసరమని పీటీఐ  నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం మెడికల్ నివేదికలను వాడుకోకూడదని కోర్టు ముందే స్పష్టం చేసింది. 

Shift Imran Khan to Hospital,  Pakistan Supreme Court, Imran Khan Health Condition, Pakistan Tehreek e Insaf, Adiala Jail

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.