బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు.!

Publish Date:Jul 31, 2026

Advertisement

 

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చెందిన   రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తీఈ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా వేధించడమే కాకుండా ఆర్థికంగానూ మోసం చేశారంటూ ఒక  యువతి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనపై కేసు నమోదై విచారణ మొదలైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెడితే..  మీడియాలో పని చేస్తూ..  హైదరాబాద్‌లోని  ఒక పీజీ హాస్టల్లో ఉంటున్న ఒక యువతికి, 2022లో ఒక ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతారావుతో  పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో కొత్తగా ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్మాణం చేపడదామంటూ ఆ యువతితో రేగా కాంతారావు పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారింది.  నెపంతో మొదలైన ఈ పరిచయం, రానురాను అత్యంత సన్నిహిత సంబంధంగా మారింది. త్వరలోనే   వివాహం చేసుకుంటానని నమ్మబలికి, అమీర్‌పేటలోని ఒక ఫ్లాట్‌లో కొన్నాళ్ల పాటు ఆమెతో రేగా కాంతారావు సహజీవనం చేసినట్లు ఆ యువతి   తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ సహజీవన సమయంలో తన అనుమతి లేకుండానే ప్రైవేటు ఫొటోలు, వీడియోలు తీశారని, తదనంతరం వాటిని అడ్డుపెట్టుకుని  బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని ఆమె పేర్కొంది. 

కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాకుండా, రేగా కాంతారావు ఆర్థిక వంచనకు  పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి, తన వద్ద నుంచి రూ. 4 లక్షల నగదును తీసుకున్నారనీ,  ఆ తర్వాత డబ్బుల గురించి, పెళ్లి విషయమై నిలదీయగా  ముఖం చాటేశారని వివరించింది. తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురైన సమయంలో ఈ విషయంపై మరింత ఒత్తిడి తేగా, ఆయన అనుచరుల ద్వారా కొన్ని విడతలుగా మొత్తంగా రూ. 8.5 లక్షలు తన  ఖాతాకు బదిలీ చేసినప్పటికీ..  తన సమస్య కేవలం డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదని ఆమె స్పష్టం చేసింది. నాలుగేళ్ల పాటు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. 

గతంలోనే ఈ అంశంపై షీ టీమ్స్‌కు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ, రేగా కాంతారావు తనపైనే ఎదురు ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. ప్రస్తుతం తనకు, తన కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే అనుచరుల నుంచి   ప్రాణహాని ఉందని, తమకు తగిన రక్షణ కల్పిస్తూ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లిలోని   అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆమె ఆశ్రయించగా, . నాంపల్లి కోర్టు   ఆదేశాల మేరకు ఈ నెల 26న పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావుపై కేసు నమోదు చేశారు.ఈ నేపధ్యంలో రేగా కాంతారావు కూడా చట్టపరమైన రక్షణ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసి, కేసును క్వాష్ చేయాలంటూ ఆయన  పిటిషన్ దాఖలు చేశారు.  

Sexual harassment case against Rega Kantha Rao, , Punjagutta Police Station FIR, BRS Former MLA Rega Kantha Rao

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మైలవరం రాజకీయాలు, వీటీపీఎస్ ఫ్లై యాష్ రవాణా వివాదం, పార్టీ అంతర్గత అంశాలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు
తెలంగాణరాష్ట్రంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నాలుగు గోడల మధ్యే తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 2020 ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల కేసులో న్యాయస్థానం అత్యంత సంచలనాత్మక తుది తీర్పును వెలువరించింది.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశ ఇంధన భద్రత, వ్యవసాయ రంగం, క్రీడలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేస్తూ ప్రధాని
ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా డా. నరేంద్రకుమార్‌ నియామకం..!
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం
తెలంగాణలోని ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.
చనిపోయిందని వైద్యులు తేల్చేస్తే.. రోడ్డు గుంత ప్రాణం పోసింది..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.