టీసీఎస్ లో లైంగిక వేధింపులు.. విచారణలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
Publish Date:Apr 14, 2026
Advertisement
సంకలనం, సేకరణ: కంఠమనేని సీతారాం దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ బ్రాంచ్ పై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి, వివక్ష, వంటి అంశాలు ఉన్నాయని దర్యాప్తు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కేసు ప్రకారం, హెచ్ ఆర్, ట్రైనింగ్ విభాగాలకు చెందిన వ్యక్తులు కలిసి యువ మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారన ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు మేరకు 18–25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆర్థికంగా, సామాజికంగా బలహీన స్థితిలో ఉన్న వీరు ముందుగానే గుర్తించి వారినే లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారిక ఆన్ బోర్డింగ్ కు ముందే ఈ ఎంపిక జరిగినట్లు సమాచారం హెచ్ ఆర్, ట్రైనింగ్ నెట్వర్క్ ఒక వ్యవస్థీకృత విధానంగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి, హెచ్ ఆర్ టీమ్ అభ్యర్థులను స్క్రీన్ చేసి ఎంపిక చేయడం, ఆ వివరాలను ప్రత్యేక ట్రైనర్లు, టీమ్ లీడర్లతో పంచుకోవడం, వాట్సాప్ గ్రూప్ ద్వారా కమ్యూనికేషన్, సమన్వయం జరిపినట్లు ఆరోపణలు ట్రైనింగ్ కాలాన్ని ఉద్దేశపూర్వకంగా పెంచుకుంటూ పోవడం, వ్యూహాత్మకంగా వారిని బలహీనులను చేసి వేధించడం, మతపరమైన వ్యాఖ్యలు ప్రవేశపెట్టడం, వ్యక్తిగత ప్రభావం చూపించడం, ఆర్థిక, సామాజిక బలహీనతలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ వేధింపులు ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై టీసీఎస్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పందిస్తూ.. సమస్య తీవ్రతను గుర్తించినట్లు పేర్కొన్నారు. సీఓఓ ఆర్తి సుబ్రహ్మణ్యన్ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ జరుగుతోందన్నారు. సంస్థ జీరో టోలరెన్స్” విధానాన్ని అవలంబిస్తున్నదని.. చట్టప్రకారం దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు. టీసీఎస్ లో మహిళలపై వేధింపుల ఘటన పని ప్రదేశంలో మానసిక వేధింపులను ఎలా గుర్తించాలి? మతపరమైన స్వేచ్ఛకు రక్షణ సరిపోతుందా? కార్పొరేట్ సంస్థల్లో సురక్షిత వాతావరణం ఉందని ఎలా నిర్ధారించాలి? బలహీన వర్గాల ఉద్యోగులకు అదనపు రక్షణ అవసరమా? అన్న ప్రశ్నలను తెరమీదకు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఆరోపణలన్నీ నిర్ధారణ అయ్యాయి. అయినా, పని ప్రదేశంలో నైతికత, వ్యక్తిగత గౌరవం, మత స్వేచ్ఛ వంటి అంశాలపై ఈ ఘటన ఒక విస్తృత చర్చ జరగాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు సంస్థలు, చట్టపరమైన వ్యవస్థలు, పనిచేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
అలాగే మానసిక , మతపరమైన ఒత్తిడికి గురి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒకటని కాదు.. పలు విధానాల ద్వారా బాధితులను వీరి వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. హిందూ ధర్మంపై విమర్శలు, అవమానకర వ్యాఖ్యలు, ఆహారపు అలవాట్లలో బలవంతపు మార్పులు అంటే బీఫ్ తినమని ఒత్తిడి చేయడం, అలాగే మతాచారాలను మార్చుకోవాలని అంటే నమాజ్ చేయమని తీవ్ర ఒత్తిడి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మానసికంగా ప్రభావితం చేసి, విశ్వాసాలను దెబ్బతీయడం, అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిగత అవమానాలకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక ట్రైనింగ్ దశలో కూడా మహిళలపై వేధింపులకు పాల్పడటం జరిగిందని తెలుస్తోంది. అదెలాగంటే..
ఈ వ్యవహారంలో టీసీఎస్ నాసిక్ బ్రాంచ్ హెచ్ఆర్ హెడ్ నిధారా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో హెచ్ఆర్, ట్రైనింగ్ నెట్వర్క్ కీలక పాత్ర పోషించిందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. అభ్యర్థుల వివరాలను షేర్ చేయడంలో కూడా పాత్ర ఉందా అన్న దానిపైనా విచారణాధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం నిధారా ఖాన్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఇప్పటివరకు.. టీమ్ లీడర్లు, ట్రైనర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వంటి పలువురిని ఈ కేసులో అరెస్టు చేశారు.
http://www.teluguone.com/news/content/sexual-harassment-at-tcs-nasik-branch-36-217295.html





