టి ఆర్ ఎస్ లోకి నలుగురు టి కాంగ్రెస్ ఎంపిలు?
Publish Date:Apr 4, 2012
Advertisement
ప్రత్యేక తెలంగాణా విషయంలో అధిష్టానాన్ని ఇరుకున పెడుతూ తీవ్ర వత్తిడి తెస్తున్న తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు త్వరలో పార్టీ నాయకత్వానికి పెద్ద ఝలక్ ఇవ్వబోతున్నారా? టి కాంగ్రెస్ లోని కొందరు ఎంపిల వ్యవహార శైలి, ప్రకటనల జోరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో తెలంగాణా వాదం మరోసారి ప్రస్ఫుటం కావడంతో తాము కూడా గులాబీ దండులో చేరకపోతే 2014లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో అనామకులుగా మిగిలిపోవలసివస్తుందని నలుగురు కాంగ్రెస్ ఎంపిలు భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎంపిలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, వివేక్, సర్వే సత్యనారాయణ త్వరలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టి ఆర్ ఎస్ లో చేరే యోచనలో ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఈ నలుగురు ఇప్పటికే టి ఆర్ ఎస్ నేతలతో రహస్యంగా మంతనాలు జరిపినట్లు తెలిసింది. సీమాంధ్రుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇవ్వదన్న నిర్ణయానికి ఈ నలుగురు నేతలు వచ్చినట్లు తెలిసింది. అందుకే ఈ నలుగురు టి ఆర్ ఎస్ లో చెరి అవసరమైతే ఉప ఎన్నికలకు సిద్ధపడాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలిసింది. సెంటిమెంట్ కారణంగా ఉప ఎన్నికల్లో తమకే విజయం లభిస్తుందని, ఆ తరువాత జరిగే సాధారణ ఎన్నికల్లో కూడా టి ఆర్ ఎస్ తమకు టిక్కెట్లు ఇస్తే మరోసారి సునాయాసంగా గెలుపొందుతామని ఈ నలుగురు నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చినా గెలవడం కష్టమనే భావనతో ఈ నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/seperate-telangana-state-24-13164.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





