బైర్రెడ్డి రాజకీయభవిష్యత్తు ఏమిటీ? టీజీ సాయంతో కాంగ్రెస్‌ నీడన చేరుతారా?

Publish Date:Oct 3, 2012

Advertisement

రాయలసీమను ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండుతో అనంతపురం నుంచి యాత్ర ప్రారంభించిన రాయలసీమహక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడిరది.  ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి పదివిలో ఇంత వరకూ కొనసాగారు. అయితే తమ పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా యాత్ర ప్రారంభించే రోజునే తానూ యాత్ర ప్రారంభించాలని బైర్రెడ్డి నిశ్చయించుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈయన్ని వదిలేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ విషయం ముందుగా తెలుసుకున్న బైర్రెడ్డి తాను ముందుగా రాజీనామా పంపించారు. కనీసం రాయలసీమ ప్రత్యేకరాష్ట్రం కోసం రాజీనామా చేశానని చెప్పుకోవటానికి రాజశేఖరరెడ్డి ఇది అవకాశంగా తీసుకున్నారు. ఈ అవకాశం వల్ల తాను తెలుగుదేశం పార్టీకి దూరమైన విషయం బైర్రెడ్డికి తెలుస్తూనే ఉంది. అయితే ఆయన్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ దశలో రాయలసీమ ప్రాంతానికి చెందిన చిన్న, భారీనీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్‌ కూడా బైర్రెడ్డి మాదిరిగా సీమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గొంతు విప్పారు. తనతో పాటు రెండో గొంతు కలిపిన మంత్రి వెంకటేష్‌ రాయలసీమ హక్కుల వేదిక నేత కూడా అవటంతో బైర్రెడ్డిని ఆయనే కాంగ్రెస్‌పార్టీలోకి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మంత్రి వెంకటేష్‌ సీమకు ప్రత్యేకప్యాకేజీ కావాలని డిమాండు చేస్తున్నారు. దీంతో ఒకరకంగా కాంగ్రెస్‌కు బైర్రెడ్డి దగ్గరైనట్లు వాతావరణం కనిపిస్తున్నా మరోవైపు మొత్తం సీమపై పట్టుసాధించాలంటే కొంత కాలం తన రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టాలని ముఖ్యసలహాదారులు ఆయనకు సలహా ఇచ్చారట. ఈ సలహా వల్ల ఆయన ఎంత వరకూ కాంగ్రెస్‌కు దగ్గరవుతారన్నది ఇప్పుడే తేల్చలేకపోతున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాక మరో ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ ఒక్కటే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.