బాబువద్ద ఉమ్మారెడ్డి ఆవేదన

Publish Date:Mar 17, 2012

Advertisement

తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితోనూ, ఆవేదనతోనూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కాపువర్గానికి తగిన గుర్తింపు లేకపోవడమే దీనికి కారణమంటున్నారు. కాపులపట్ల పార్టీ అధినాయకత్వం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తోందని, దీనితో కాపువర్గం తీవ్ర అసంతృప్తితో ఉందని ఆయన చంద్రబాబునాయుడుకు చెప్పినట్లు తెలిసింది. పనిలో పనిగా తనకు రాజ్యసభ టిక్కెట్ ఇస్తే కాపు అసంతృప్తిని కొంత తగ్గించవచ్చునని ఆయన అధినేతకు సూచించినట్లు తెలిసింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీలో ఉంటూ అంకితభావంతో పనిచేసిన తనను విస్మరిస్తే కాపులు పార్టీకి మరింత దూరమవుతారని ఆయన చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున 10 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా వారిలో కాపు సామాజికవర్గం నుంచి ఒక్కరు కూడా లేరని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వివార్షిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఇద్దరు గెలిచే అవకాశం ఉంది. దీంతో రాజ్యసభ టిక్కెట్లకోసం అనేకమంది సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్రావు కూడా చేరారు.

 

 

By
en-us Political News

  
తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రేటర్   పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన  పలువురు  ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.  దానం నాగేందర్, వివేకానంద వంటి నేతల ఫిరాయింపులు పార్టీ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపాయి.
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.
తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్షుల కూతను బట్టి జాతిని గుర్తించే సరికొత్త ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు.
తెలంగాణను ఇచ్చిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా  ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా   1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్   తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.