'వీర' కల్తీ ప్రాణాలు హరీ!
Publish Date:Feb 15, 2012
Advertisement
హైదరాబాద్: ఆయన అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. పంచకట్టులో పెద్దరికం ఉట్టిపడే ఆహార్యంతో ఉంటారు. చేతిలో సిగరెట్, మాటల్లో సీమయాస ఉట్టిపడుతూ ఉంటుంది. ఇవన్నీ ఆయనలోని ఓ వైపు మనిషినే సూచిస్తాయి. ఆయనలో మరో మనిషి కూడా ఉన్నాడు. 'చీప్ గా కల్తీ మద్యం తయారు చేయించి విక్రయించడం, రూ.కోట్లు దండుకోవడం, కల్తీ మద్యం తాగి సామాన్యులు అనారోగ్యానికి గురైనా.. ఏకంగా ప్రాణాలు కోల్పోయినా.. ఆయన కనుసన్నల్లో నడిచే వైప్ షాపుల్లో నకిలీ మద్యం ఉండాల్సిందే. ఈ నకిలీమద్యంలో ఒకటి మత్తు ఎక్కించనిదైతే, మరొకటి ప్రాణాలు హరించేది. ఈ తతంగమంతా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా తెలీనట్లు నటిస్తున్నారు. ఎందుకంటే వారు కూడా ప్రతి నెలా మామూళ్ళ మత్తులో తూగుతూ ఉంటారు. కడపజిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే పొరుగు జిల్లా అనంతలోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి కల్తీ మద్యం దందాను నడుపుతున్నారు. రూ.కోట్లు దండుకుంటున్నారు. వైయస్సార్ జిల్లాలోనే ఈ కల్తీ మద్యం రాజ్యమేలుతోంది. కమలాపురం ప్రొద్దుటూరు, మైదుకూరు, పోట్లదుర్తితోపాటు కట్నాటకలోని బాగేపల్లి ప్రాంతంలో నకిలీమద్యం ఊట ఉబుకుతుంది. చీప్ లిక్కర్ కేసులో 48 బాటిళ్ళు ఉంటాయి. అందులో ఒక్కో బాటిల్లో 18 మిల్లీ లీటర్ల మద్యం ఉంటుంది. ఈ కేసుల్లోని మద్యం బాటిళ్ళ మూతపై ఉన్న సీలు తీసేసి ఆ ప్రాంతంలో సన్నని కడ్డితో రంధ్రం చేస్తారు. దాని ద్వారా 60 మిల్లీ లీటర్ల మద్యాన్ని తీసేస్తారు.ఆ మేరకు నీటిని బాటిళ్ళలోకి ఎక్కిస్తారు. తిరిగి సీల్ ను అలాగే అతికిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఆరు కేసులకు గాను ఒక కేసు కల్తీ మద్యం అక్రమంగా తయారవుతుంది. ఇలా ఒక్కో బ్రాందీ షాపులో అదనంగా 50 కేసుల మద్యం విక్రయిస్తారు. ఈ లెక్కన ఆరు కేసుల మద్యం అదనంగా తయారైనట్లే. ప్రస్తుతం ఒక్కో కేసును 2,500 నుంచి 3000 వరకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మద్యం దుకాణాల్లో ఒక్కో బాటిల్ ను రూ.70 కి విక్రయిస్తారు. ఈ లెక్కన ఒక్కోకేసు రూ.3,360 అవుతోంది. ఆరు కేసులకుగాను రూ. 20,160 వస్తుంది. ఈ మద్యాన్ని తాగడం వల్ల ఎక్కువ కిక్ ఇవ్వక పోవడంతో మరో షాపులోకి మద్యం ప్రియులు వెళ్ళడం కొన్నాళ్ళు నడిచింది. ఇది గమనించిన సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు రూ.60కే క్వార్టర్ ఇవ్వడం మొదలుపెట్టాడు. దీంతో తిరిగి ఆయన కౌంటర్ లో వ్యాపారం రోజుకు 1.50 లక్ష దాటుతోంది. వైయస్సార్ జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ళలో అధికశాతం దుకాణాల్లో నకిలీ దండా నడుస్తోంది. దీంతో ప్రొద్దుటూరులోని 10 షాపుల్లో నకిలీని విక్రయిస్తున్నారు. ఇవన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేషాపులతో పాటు ఆయన కనుసన్నల్లో నడిచేవే. ముఖ్యంగా శివాలయంలో రోడ్డులోని ఓ బార్ లో ఈ నకిలీ దందాకు అంతేలేదు. దీంతోపాటు కమలాపురంలో కూడా ఈ తంతు నడుస్తోంది. కడప నగరంలో కూడా భారీగానే కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. ఒక్క ప్రొద్దుటూరులో సీనియర్ ఎమ్మెల్యేకు చెందిన దుకాణాల ద్వారా రోజుకు 5-10 లక్షల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది. ఈ దందాను సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు నడిపిస్తున్నాడు. వైయస్సార్ జిల్లాలోని నకిలీ మద్యాన్ని విక్రయించే 80 షాపుల ఆదాయం కోట్లరూపాయల్లో ఉంటుంది. నకిలీ మద్యం ఎక్కడ తయావుతోంది? ఎలా వస్తోంద? ఎవరి కనుసన్నల్లో దందా జరుగుతోంది. అనేవిషాయాలుఇక్కడ ఎక్సైజ్ అధికారులకు సుస్పష్టంగా తెలుసు. అయినా తెలీనట్లు ఉంటారు. ప్రతి నెలా మామూళ్ళు అందుతుండటమే అధికారులు కిమ్మనకుండా ఉండటానికి అసలు కారణమని తెలుస్తోంది.
కల్తీ మద్యం తయారీ ఇలా:
ఎక్సైజ్ అధికారులకు తెలిసినా:
http://www.teluguone.com/news/content/senior-mla-24-11939.html





