లోకేష్ డిక్లరేషన్ కు సీమ ఫిదా!

Publish Date:Jun 8, 2023

Advertisement

విశ్వాసం పట్టుదల కలగలిసి సాగుతున్న నారాలోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ నాలుగు జిల్లాలనూ చుట్టేసింది. మరో మూడు నాలుగు రోజులలో  సీమలో లోకేష్ పాదయాత్ర పూర్తి అవుతుంది. అధికార వైసీపీకి పెట్టని కోటగా చెప్పుకునే సీమలో జనం లోకేష్ కు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే.. సీమలో రాజకీయం మారుతోందన్నది స్పష్టంగా గోచరిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

 తెలుగు దేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్  విశ్వాసం ఊపిరిగా  పట్టుదల శ్వాసగా సాగిస్తున్న యువగళం పాదయాత్ర  బుధవారం ( జూన్ 7) 119 రోజులు పూర్తి చేసుకుంది.   ఈ క్రమంలో ఆయన సీమ జిల్లాల్లో  42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1516 కి.మీ. పాదయాత్ర చేశారు.  ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన యువగళం పాదయాత్ర, అప్రతిహాతంగా, అశేష జనాదరణతో సాగుతోందనడంలో సందేహం లేదు. యాత్రను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ జీవో 1 సహా అనేకానేక అడ్డంకులు సృష్టించింది. ప్రచార రథాలను సీజ్ చేసింది. మాట్లేడేందుకు మైకు లేకుండా లాగేసుకుంది. నిలుచున్న స్టూల్ ను సైతం లాగేసింది. దాడులయత్నాలు జరిగాయి. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వైసీపీ శ్రేణులు వ్యవహరించాయి. ఇక పోలీసుల ఓవరేక్షన్ గురించి చెప్పనే అవసరం లేదు. అయితే ఎక్కడా లోకేష్ ఆగలేదు.. వెనకడుగు వేయలేదు.  

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక, దుర్మార్గ పాలన, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు  ముఖ్యంగా యువతకు వివరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో.. గత తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పోలిస్తే జగన్ చెబుతున్న సంక్షేమంలోని డొల్ల తనాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలా జనం బలంతో, జనం ఆదరణతో సాగుతున్న లోకేష్ పాదయాత్ర సీమ జిల్లాలను చుట్టేసింది. కడపలో అయితే జగన్ పునాదులు కదిలిపోతున్నాయా అన్నట్లుగా జనం లోకేష్ కు స్వాగతం పలికేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు పోటెత్తారు.  పాదయాత్రలో లోకేష్ తొలి అడుగు పడక ముందే చిత్తూరు జిల్లాలో  ప్రచార రథం. మైకు, సౌండ్ సిస్టం ఇతర ప్రసార సాధనాలు, ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం నుంచి తంబళ్ళపల్లి మధ్యలో సగటున ప్రతి 20 కిలోమీటర్లకు  ఒక కేసు పెట్టారు.  అయినా లోకేష్  ముందడుగేశారు. వేస్తూనే ఉన్నారు.

అంతే కాదు, పాద యాత్రతో పాటుగా లోకేష్ ఎక్కడి కక్కడ వివిద వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశ మవుతున్నారు. సమస్యలు అడిగి తెలుసు కుంటున్నారు. వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. తెలుగు దేశం అధికారంలోకి వస్తే, ప్రజలు తమ ముందుంచిన సమస్యలను ఎలా పరిష్కరిస్తామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే, ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభలు నిర్వహించి ఆ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా  సహా ప్రజల ముందుంచుతున్నారు. చర్చకు సిద్దమని సవాలు విసురుతున్నారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన సంస్థలు, అన్న కాంటీన్ల ముందు సెల్ఫీలు దిగుతూ ...జగన్ రెడ్డి సర్కార్ కు సెల్ఫి సవాళ్ళు విసురుతున్నారు.  దీంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్ళు  పరుగెడుతున్నాయి. అందుకే యాత్ర ప్రారంభంలో అవహేళన చేసిన వైసేపీ నాయకులు, ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు.జన ప్రభంజనమై సాగుతున్న యువగళం గర్జనలకు భీతిల్లి పోతున్నారు. అన్నిటికీ మించి కడప నడిబొడ్డున  కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద మిషన్ రాయలసీమపై నిర్వహించిన సదస్సు  నిజంగా చాలా చాలా ప్రత్యేకం అని చెప్పాలి.

ఈ సదస్సుకు రాయలసీమ నలుమూలల నుంచి  మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజలు తరలివచ్చారు. అందరి సమక్షంలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన లోకేష్ మేధావుల మన్నన పొందారు. సీమ ప్రగతి కోసం లోకేష్ ప్రకటించిన డిక్లరేషన్ చిత్తశుద్ధితో అమలు చేస్తే సీమ అభివృద్ధి ఖాయమని, వెనకబాటు తనం మటుమాయమౌతుందని వారు అంటున్నారు. అమలు విషయంలో సందేహాలు అనవసరమనీ, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఐదేళ్లలో సీమ రూపురేఖలు మార్చేస్తామని చెప్పిన లోకేష్.. ఇందు కోసం అవసరమైతే తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడేందుకైనా తను సిద్ధమని ప్రకటించారు.  

కర్నూలు జిల్లాలో వ్యవసాయ పరికరాల తయారీ హబ్, బెంగళూరు – హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో కేంద్ర బిందువుగా కర్నూలును మార్చి పరిశ్రమల్ని ఆకర్షించడం అలాగే వ్యవసాయ పరిశోధనలకు కేంద్ర బిందువుగా కర్నూలును మార్చడం,  జాతీయ, అంతర్జాకీయ క్రీడాకారులను తీర్చి దిద్దే స్పోర్ట్స్ యూనివర్శిటీ హబ్‌గా కడప ,  ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా చిత్తూరు,  అనంతపురం నుంచి ఆటోమోబైల్ తయారీ రంగం హబ్‌ వంటివి లోకేష్ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ లో ఉన్నాయి.  అలాగే  పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి,  ప్రతి ఎకరానికి సాగునీరు, వాటర్ గ్రిడ్ ద్వారా 24/7 ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, శ్రీశైలం కేంద్రంగా రాయలసీమను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయడం వంటివి కూడా లోకేష్ డిక్లరేషన్ లో ఉన్నాయి. 

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.