Publish Date:Jun 30, 2026
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, ఐఏఎస్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే. రామకృష్ణా రావు, ఐఏఎస్ ఈ రోజు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల మేరకు సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతో పాటు కే. రామకృష్ణా రావును పుష్పగుచ్ఛాలతో అభినందించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sanjay-jaju-takes-charge-as-new-telangana-cs-36-224656.html
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.