జాతీయ స్థాయిలో విష్ణువర్ధన్ రెడ్డికి కీలక బాధ్యత..!

Publish Date:Aug 17, 2026

Advertisement

 

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువ నేత, పార్టీ వక్త ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆయనను ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనకు జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సెల్స్, విభాగాల మధ్య సమన్వయం చేయడం విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఆయా విభాగాల కార్యకలాపాలను పార్టీ జాతీయ నాయకత్వంతో అనుసంధానం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. 

దీంతో ఇప్పటివరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన ఆయన రాజకీయ బాధ్యతలు జాతీయ స్థాయికి విస్తరించనున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ వక్తగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుర్తింపు పొందారు. పార్టీ విధానాలను మీడియా వేదికలపై బలంగా వినిపించడం, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం ఇవ్వడం, సమకాలీన అంశాలపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన వాగ్దాటి, రాజకీయ అంశాలపై అవగాహనకు తోడు సంస్థాగత అనుభవం కూడా ఉండటంతో తాజాగా జాతీయ స్థాయిలో సమన్వయ బాధ్యత అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలకు ప్రాధాన్యత లభించింది. దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా, రాంమాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు దక్కగా, విష్ణువర్ధన్ రెడ్డికి కీలకమైన సమన్వయ బాధ్యత లభించింది. ఒకే జాతీయ కార్యవర్గంలో ఏపీకి చెందిన నేతలకు కీలక బాధ్యతలు దక్కడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సీనియర్ నేతలతో పాటు యువ నాయకత్వానికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి నియామకాన్ని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. 

యువతతో అనుసంధానం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని ఇక దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో వినియోగించుకునే అవకాశం లభించింది. ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలతో సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పార్టీ వక్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత లభించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచింది.

S. Vishnuvardhan Reddy, BJP, D Purandeswari, Ram Madhav, Smriti Irani, Andhra Pradesh BJP,
Telangana BJP, Pm modi, Nitin Nabin, Smriti Irani, Vasundhara Raje

By
en-us Political News

  
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.