Publish Date:Sep 13, 2026
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.
[ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/konda-murali-25-231380.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.