Publish Date:Sep 15, 2026
తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.
అయితే, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి కేబినెట్ హోదా ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ.. కొండా సురేఖ పార్టీ నాయకత్వంపై దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా.. తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post, RTC Chairman, Revanth Reddy, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/konda-surekha-25-231497.html
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.