Publish Date:Jun 23, 2026
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ఎంతో కాలంగా రైతాంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈసారి ఒకే విడతలో మొత్తం నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతుల్లో కొత్త ఆశలు, ఆనందాలు చిగురిస్తున్నాయి.
ఈ భారీ నిధుల విడుదల కార్యక్రమానికి జూన్ 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో వేదిక సిద్ధమవుతోంది. అక్కడ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా కంప్యూటర్ బటన్ నొక్కి ఒకే క్లిక్‌తో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు బదిలీ చేయనున్నారు. ఈ క్రతువును అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ఇప్పటికే కొత్త పాస్‌బుక్‌ల వివరాలను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ (CCLA) ద్వారా సేకరించి, లబ్ధిదారుల జాబితాను సర్వం సిద్ధం చేసింది.
ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది రైతులకు ఈ విడతలో రైతు భరోసా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.9,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. అయితే ఈసారి నిధుల పంపిణీలో ప్రభుత్వం పక్కా నిబంధనలను అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సాగులో లేని రోడ్లు, కొండలు, గుట్టలకు కూడా నిధులు వెళ్లాయని భావించిన ప్రభుత్వం, ఈసారి కేవలం వాస్తవంగా సాగు చేస్తున్న భూములకు మాత్రమే భరోసా ఇస్తామని తెగేసి చెప్పింది. తెలంగాణలో మొత్తం 1.50 కోట్ల ఎకరాల భూమి ఉండగా, అందులో దాదాపు 20 నుంచి 25 లక్షల ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, కుంటలు మరియు బీడు భూములుగా మారినట్లు ప్రభుత్వ లెక్కలు తేల్చాయి. అందుకే ఆ భూములను ఈ పథకం నుండి పూర్తిగా మినహాయించారు.
గత యాసంగి (రబీ) సీజన్‌లో కేవలం రెండు ఎకరాల లోపు ఉన్నవారికే నిధులు అందడంతో రైతాంగంలో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఆ అసంతృప్తిని పోగొట్టేలా ఈసారి ఖరీఫ్ సీజన్‌కు గాను 7 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఒకే విడతలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకే విడతలో ఈ భారీ పెట్టుబడి సాయం అందుతుండటంతో వ్యవసాయ పనుల్లో వేగం పుంజుకోనుంది. జూన్ 20న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 23వ విడత నిధులను, అలాగే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కూడా జూన్ 30న ఈ నిధులను విడుదల చేస్తుండటం విశేషం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rythu-bharosa-telangana-single-installment-release-36-223849.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.