వైసీపీకి తమ్మినేని గుడ్ బై?

Publish Date:Aug 5, 2026

Advertisement

 వైసీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్  తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందా? ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  వైసీపీలో  కీలక నేతగా గుర్తింపు పొందిన తమ్మినేని  ఇటీవలి కాలంలో వరుస వివాదాలు, న్యాయపరమైన చిక్కులతో సతమతమౌతున్నారు. అలాగే వైసీపీలో కూడా ఆయనకు పెద్దగా ప్రాముఖ్యత లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసే ఉద్దేశంలో ఉన్నారన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. 

 ఇటీవల వెలుగుచూసిన   ఆస్తి వివాదం,  నకిలీ  డెత్ సర్టిఫికెట్ తో  భూ కబ్జా కుట్ర ఆరోపణలు తమ్మినేని ప్రతిష్ఠను బాగా దెబ్బతీశాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో తమ్మినేనితో పాటు ఆయన సతీమణి వాణిశ్రీ, కుమారుడు వెంకట శ్రీరామ్ లు నిందితులుగా ఉన్నారు. అరెస్టును తప్పించుకోవడానికి తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు కూడా.  పరారీలో ఉండగానే కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందిన తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.

ముందస్తు బెయిలు లభించని ఆయన కుమారుడు  శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయి బెయిలు పొందారు.   హైకోర్టు ధర్మాసనం కూడా తమ్మినేని సీతారాం,  ఆయన భార్యపై తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. 

ఇదంతా ఒకెత్తయితే.. ఈ కేసు విషయంలో తమ్మినేనికి వైసీపీ నుంచి ఎటువంటి మద్దతూ లభించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.   2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు.   వైసీపీ అధినేత జగన్ కూడా  తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు.

ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అన్నిటినీ ఓర్చుకుంటూ పార్టీలో కొనసాగుతున్న తనకు క్లిష్ట సమయంలో పార్టీ నుంచి కనీస మద్దతు లభించకపోవడంతో తమ్మినేని మనసు విరిగి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి నిర్ణయించుకున్నారంటున్నారు.  ఏ క్షణంలోనైనా తమ్మినేని సీతారాం వైసీపీకి రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.

Thammineni Seetharam,   Resignation, AP Former Speaker,  Srikakulam Property Dispute  

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.