అసెంబ్లీలో RRR షో.. కేసీఆర్ తో ఈటల ఫేస్ టు ఫేస్..

Publish Date:Mar 2, 2022

Advertisement

వచ్చేసింది. ఆ సమయం రానే వచ్చేసింది. తెలంగాణ అసెంబ్లీలో RRRలు అడుగుపెట్టే గడియ వచ్చేసింది. బడ్జెట్ సెషన్ తో.. తొలిసారి కేసీఆర్, ఈటల రాజేందర్లు ఫేస్ టు ఫేస్ తలపడనున్నారు. సుదీర్ఘ కాలం.. దాదాపు 2 దశాబ్దాల కాలం.. కలిసి పని చేసి.. ఉద్యమాన్ని ఉరకలెత్తించి.. అనేక ఎన్నికల్లో పోరాడి గెలిచి.. నిలిచిన.. ఆ ద్వయం.. తొలిసారి ద్వంద్వ యుద్ధానికి దిగబోతోంది. అందుకే ఈసారి తెలంగాణ సభాసమరం.. రంజుగా మారనుంది..అంటున్నారు.

ఈటల రాజేందర్. మనిషి కొంచెమే అయినా.. గొంతు ఘనం. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ నుంచి.. ఉద్యమ వీరుడి వరకూ ఆయన చరిత్ర అందరికీ తెలిసిందే. కేసీఆర్ చెంతనే ఉంటూ ఆయన తర్వాత ఈయనే అనేంత ఇమేజ్. అలాంటి ఈటలను ఒక్క రోజులోనే తొక్కేశారు కేసీఆర్. భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి వేటేయడం.. పార్టీ వీడిపోయేలా చేయడం.. హుజురాబాద్ ఉప ఎన్నిక.. సర్వశక్తులూ ఒడ్డినా ఈటల గెలుపు అడ్డుకోలేకపోవడం.. ఇలా వరుస ఎదురుదెబ్బల తర్వాత.. ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టేందుకు రాజేందర్ సమాయత్తమవుతున్నారు. ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి.. అధ్యక్షా.. అంటే చాలు.. కేసీఆర్ అహంకార మెడలు వంచినట్టే. గులాబీ బాస్ కు దారుణ పరాభవం జరిగినట్టే. ఆ సమయం, సందర్భం మరెంతో దూరంలో లేదు.. అసెంబ్లీ బెల్ మోగడం.. ఈటల సభలో కాషాయ కండువాతో అడుగుపెట్టడం.. అది చూసి కేసీఆర్ పరిస్థితి ఏంటి అంటున్నారు తెలంగాణ వాదులు. గోడకు కొట్టిన బంతిలా.. అసెంబ్లీకి దూసుకొస్తున్న ఈటల రాజేందర్ ను ఫేస్ చేయడం కేసీఆర్ తరం అవుతుందా? అనే చర్చ కూడా మొదలైంది. 

ఎందుకంటే, ఈటల మంచి వక్త. ఉద్యమకారుడు. దూకుడు స్వభావం ఉన్నోడు. పైగా ఏళ్లుగా కేసీఆర్ సహచరుడు. మంత్రి కూడా. ప్రభుత్వ లోటుపాట్లు, ముఖ్యమంత్రి అసలు నైజం పూర్తిగా తెలిసిన వాడు. అందుకే, రాజేందర్ ఒక్కో అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. కేసీఆర్ ను నిలదీస్తుంటే.. ఆహా.. ఆ సీన్ చూడాలని కోట్లాది మంది తెలుగువారు కోరుకుంటున్నారు. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈసారి ఈటలతో పాటు RRR కాంబినేషన్ పై చాలా ఆసక్తి నెలకొంది. రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు. ముగ్గురూ ముగ్గురే. త్రిబుల్ ధమాకా. ఎవరూ ఎందులో తగ్గేదేలే. బాగా నోరున్న ఆ ముగ్గురి కాషాయ దళం.. కేసీఆర్ పై సభలో గెరిల్లా దాడి చేయడం ఖాయమంటున్నారు. ప్రజల పక్షాన.. ప్రజా వాయిస్ ను.. అత్యంత బలంగా వినిపించడం.. కేసీఆర్ సర్కారును అడుగడుగునా కార్నర్ చేయడం.. అబ్బో ఊహించుకుంటుంటేనే తెలంగాణ అసెంబ్లీ ఎంత వాడివేడిగా జరుగుతుందో అర్థమైపోతోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ను బాగా సైడ్ చేసిన బీజేపీ.. ఇప్పుడిక సభలోనూ ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం అంటున్నారు. అయితే, పొలిటికల్ మాస్టర్ మైండ్ కేసీఆర్.. ఆ ముగ్గురికీ అంత ఈజీగా ఛాన్స్ ఇస్తారా? తనను నిలదీసేందుకు మైక్ ఇస్తారా? ఏదో సాకు చూపి బహిష్కరణ వేటు వేసేస్తారా? చూడాలి ఏం జరగనుందో...!? 

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.