పెద్దలను తప్పించడానికే కులంపై దర్యాప్తు జరిపారా?

Publish Date:Apr 21, 2016

Advertisement

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల కులం వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా రోహిత్ దళితుడు కాదని వడ్డెర కులస్తుడని సైబరాబాద్ పోలీసులు ఉమ్మడి హైకోర్టుకు తెలియజేశారు. ఈ కేసును దర్యాప్తు జరుపుతున్న గచ్చిబౌలి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రమేశ్ కుమార్ హైకోర్టుకు అందజేసిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారం మొత్తం అతని కులం చుట్టూనే తిరిగాయి. అతను దళితుడు కావడం వల్లే అతనితో పాటు మరో నలుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారని ఏఎస్‌ఏ విద్యార్ధులు ఆరోపించారు. అయితే రోహిత్ తండ్రి తాము వడ్డెర కులానికి చెందిన వారమని చెప్పడంతో కేసులో కొత్త వాదన మొదలైంది. దానికి స్పందించిన రోహిత్ తల్లి తాను మాల కుటుంబంలో జన్మించానని, కానీ తనను పెంచి పోషించింది మాత్రం వడ్డెర కులానికి చెందిన కుటుంబమని తెలిపింది.

 

రోహిత్ ఆత్యహత్య ఎందుకు చేసుకున్నాడన్న దానికన్నా..అతని కులం చుట్టూనే వివాదం ముసురుకుంది  దీంతో పోలీసులు జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లా గురజాలలో ఉన్న రోహిత్ తండ్రి నాగమణికుమార్, తండ్రి తరపున బంధువులు, గ్రామ సర్పంచ్, రోహిత్ తల్లి రాధిక బంధువులు, రోహిత్ సోదరుడు రాజచైతన్య కుమార్‌కు తహసీల్దార్ ఇచ్చిన కులధ్రువీకరణ పత్రం ఆధారంగా రోహిత్ వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. గుంటూరులోని రోహిత్ చదివిన పాఠశాల రికార్డుల్లో కులం గురించిన ఆధారాలు లభించలేదని, ఇంటర్, డిగ్రీ రికార్డుల్లో మాత్రం ఎస్సీ మాలగా నమోదై ఉందన్నారు. రోహిత్ తల్లి రాధికను దత్తత తీసుకున్నట్లు అంజనీ దేవి చెప్పిన విషయంపై ఇంకా విచారణ జరపాల్సి ఉందన్నారు.

 

1989 జనవరి 30న పుట్టినట్టు ఎస్సీ కులానికి చెందిన వాడని పేర్కొంటూ గురజాల ఎమ్మార్వో రోహిత్‌కు సర్టిఫికేట్‌  జారీ చేశారు. అయితే గతంలో మిగిలిన వారి సర్టిఫికేట్లలో వడ్డెర కులాన్నే ప్రస్తావించినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ తండ్రి వేముల మణికుమార్, తల్లి రాధిక, మణికుమార్ బంధువులు, రోహిత్ సోదరుడు, రోహిత్ అమ్మమ్మల వివరణలతో పాటు నీటిపారుదల శాఖలో తండ్రి గతంలో సమర్పించిన పత్రాలను సైతం సేకరించి వాస్తవాలను తెలుసుకుంటున్నారు. మొత్తం మీద రోహిత్ తండ్రి నాగమణి కుమార్, తల్లి రాధిక ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోనికి తీసుకుని రోహిత్‌ను వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా తేల్చినట్టు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.

 

మరోవైపు ఆత్మహత్యకు పురిగొలిపారనే ఆరోపణలపై హెచ్‌సీయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. రోహిత్ అసలు దళితుడే కానప్పుడు కేంద్రమంత్రి, వీసీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదని వారిపై కేసులు తొలగించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సైబరాబాద్ పోలీసులు హైకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయినా పోలీసులు ఆత్మహత్యకు కారణాలు వదిలివేసి అతని కులంపై దర్యాప్తు చేసింది కేవలం పెద్దలను తప్పించడానికేనా?

By
en-us Political News

  
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.