"స్టఫ్" లేని సెలబ్రిటీలు..
Publish Date:Apr 21, 2016
Advertisement
సెలబ్రిటీలు..ఇండియాలో వీరికున్నంత క్రేజ్ ఎవరికి ఉండదు. సాహిత్యం, డ్యాన్స్, నటన, క్రీడలు , రాజకీయం ఇలా తమ తమ రంగాల్లో మోస్గ్ టాలెంటెడ్ పర్సన్స్ వీళ్లు. వీళ్ల ప్రతిభ చూసి అబ్బో వీళ్లకు ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి ఆ రేంజ్‌కు వెళ్లుంటారు అని జనాల ఫీలింగ్. కాని మన ప్రముఖులకు వారి రంగాల్లో తప్ప బయట నాలెడ్జ్ సున్నా. ఇది ఏ మీడియానో..వీకీలీక్స్..పనామా పేపర్సో బయట పెట్టలేదు. స్వయంగా వాళ్లంత వాళ్లే బయటపడ్డారు. తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్ కమ్ యాక్టర్ కమ్ పొలిటిషీయన్ అయిన శ్రీశాంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కేరళను రాష్ట్రంగా కాకుండా..ఓ నగరంగా పేర్కొన్నారు. శ్రీశాంత్ బేసిగ్గా సోషల్ మీడియాలో యమా యాక్టివ్. పైగా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ తరపున కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ గెలిస్తే కేరళ నగరాన్ని ప్రపంచంలోనే బెస్ట్ నగరంగా చేస్తామని..మనమంతా కలిసి కేరళను ప్రపంచంలోనే అత్యుత్తమ సిటీగా తీర్చిదిద్దుకుందామంటూ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. దీనిపై కేరళీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మై గాడ్..కేరళ నగరం కాదు..నీకు జనరల్ నాలెడ్జ్ లెసెన్స్ అవసరం. నువ్వు ముందు జాగ్రఫీ నేర్చుకో తర్వాత రాజకీయాల వైపు చూడు అంటూ ఒకరు, కేరళ నగరమైతే, నీ దృష్టిలో భారత్ ఓ రాష్ట్రమా అని మరొకరు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. బాలీవుడ్ నటి అనుష్క శర్మ నాలెడ్జ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మేడమ్ గారికి మన నేతల పేర్లు కూడా సరిగా తెలియదు. తెరపై హీరోలతో రోమాన్స్ చేయడంలో ఉన్న నాలెడ్జ్. సోషల్ స్టడీస్‌లో కానీ లేదు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మరణించినప్పుడు దేశం మొత్తం ఆయనకు నివాళులర్పించింది. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. వీరి బాటలోనే అనుష్క కూడా కలామ్‌కి నివాళులర్పించాలనుకుంది. అందరూ ట్వీట్ చేస్తున్నారు, నేను కూడా ట్వీట్ చేయ్యాలనుకుంది. అయితే ఈవిడ గారికి ఏపీజే అబ్దుల్ కలామ్ పేరు సరిగా గుర్తు లేదు. ఏపీజే అబ్దుల్ కలామ్ అనే పేరుకు బదులుగా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు తప్పుగా రాసింది. మొదట "ABJ KALAM AZAD'' అని ఒకసారి "APJ KALAM AZAD" అని రెండవ సారి ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ సెటైర్లు వేశారు. దీంతో ఒళ్లు దగ్గర పెట్టుకుని మూడోసారి కరెక్ట్‌గా రాసింది. ఇలాంటివి రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయినా మన సెలబ్రిటీలు కళ్లు తెరవడం లేదు. సెలబ్రిటీలంటే ప్రజల్లో ఒక విలువ, గౌరవం ఉన్నాయి. ఇకనైనా కాస్త స్పృహలోకి వచ్చి బయట విషయాలు కూడా తెలుసుకుంటే మంచిది. లేదంటే ప్రజల్లో నవ్వులపాలవ్వడం ఖాయం.
http://www.teluguone.com/news/content/bjp-45-58960.html





