తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం రహదారి భద్రతా సెస్సు ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. నూతన నిబంధనల ప్రకారం, ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2 వేలు, కారుపై రూ. 5 వేలు, భారీ వాహనాలపై రూ. 10 వేల చొప్పున రహదారి భద్రతా సెస్సెను వసూలు చేస్తారు. అయితే ఈ సెస్సు నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు మినహాయింపునిచ్చారు.
ఇక పోతే సరుకు రవాణా వాహనాలకు ఇప్పటివరకు ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ, దాని స్థానంలో 7.5 శాతం లైఫ్ ట్యాక్స్ అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైనా 4 నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుందని ఆయన చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/road-safety-ses-in-telangana-36-211934.html
ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 35.19 కోట్ల రూపాయల వ్యవయంతో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ ఈ నిధులను అందజేసింది. ఈ మౌలిక సదుపాయాలలో ప్రధానంగా దీక్ష విరమణ మండపం, భక్తుల సత్రం నిర్మాణం వంటివి ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్‌లో ఈ ఉదయం జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు ఖతమయ్యారు. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా శనివారం (జనవరి 3) ఉదయంజరిగిన రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. సుక్మా జిల్లాలో 12 మంది మావోలు మరణించగా, బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ మరణించారు.
తన ట్వీట్ కు దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు.
ఈ ఒక్క బ్రిడ్జితో ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఔను ఎప్పుడో నాలుగేళ్ల కిందట విశాఖపట్నం, రాజాం రోడ్డులో చీపురుపల్లి సమీపంలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిని అది శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలను కలిపే ఈ కీలక బ్రిడ్జి మూతపడటంతో వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. వీరు గమ్యస్థానాలకు చేరడానికి నిత్యం 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీనివాస కల్యాణంలో ప్రపంచ తెలుగు మహా సభలకు అంకురార్పణ జరిగింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, సన్మానాలతో పాటు తెలుగు చలన చిత్ర గీతాలాపనలు జరగనున్నాయి.
సిర్గాపూర్ ఎస్సీ బీలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి వేధిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం (జనవరి 1) రాత్రి కడ్పల్, సిర్గాపూర్ రహదారిపై బైఠాయించారు. దీంతో అధికారులు హాస్టల్ కు వచ్చి విచారణ జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్ కిషన్ నాయక్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. నష్టం వివరాలను అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
పెండ్యాల సురేందర్ స్వరూప దంపతులు ఐదేళ్ల కిందట వరంగల్‌లోని మహారుషి గోశాల నుండి ఓ ఆవును తెచ్చుకుని దానికి గౌరి అని నామకరణ చేసారు. దానిని నిత్యం పూజిస్తూ కన్నబిడ్డలా సాకారు. ఆ ఆవు గత నెల 19న ఓ లేగదూడకు జన్మనిచ్చింది. లేగదూడ పుట్టి 13 రోజులు పూర్తి కావడంతో ఆ లేగదూడకు ఘనంగా నామకరణ మహోత్సవం నిర్వహించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఏకాంత సేవ అనంతరం గుడి మూసివేసిన విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. ఆలయం గోపురంపైకి ఎక్కిన నినాదాలు చేశాడు.. వెంటనే గమనించిన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది.
రాష్ట్రపతి భవన్‌లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ఉద్యాన్ ఉత్సవ్ రెండవ ప్రదర్శన జరగనుంది.
కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది.
నవ్యాంధ్రలాంటి రాష్ట్రానికి అవసరమా? ఇంతకీ జగన్ పెట్టిస్తోన్న అనవసర ఖర్చులేవి? తాజాగా వెలుగులోకి వచ్చినదేంటి?