Publish Date:Jul 11, 2026
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2028 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాఇలా కాదు.. ఏకంగా భద్రాద్రి రాములోరి మీద ఒట్టేసి మరీ ఈ విషయం చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో నిర్వహించిన రైతు భరోసా చివరి విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నరేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతూ.. భద్రాచలం రాముడి మీద ఆన... వచ్చే ఎన్నికల్లో 117 స్థానాల్లో గెలిచి తీరుతాంమని ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 119 శాసనసభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లేదా స్థానాల పెంపు బిల్లు ఆమోదం పొందితే, తెలంగాణలో సీట్లు దాదాపు 50 శాతం మేర పెరగనున్నాయన్న రేవంత్.. ఈ పెంపుదల ప్రకారంగా ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు భవిష్యత్తులో 182 స్థానాలకు చేరనున్నాయన్నారు.
అలాగే.. ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ పంచాయితీ లేదని, ప్రజలే తమ బలమని, ప్రజలతోనే కలిసి నడుస్తూ విజయం అందుకుంటామని పేర్కొన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులమయం చేయడం వల్లే కొంత ఇబ్బంది ఎదురౌతోందన్న రేవంత్.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తాము 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
Revanth Reddy vow on Lord Ram, Telangana assembly seats increase 182, Revanth Reddy 117 seats Congress, Telangana early elections clarity
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-reddy-vow-on-lord-ram-39-225735.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.