బెజవాడ మేయర్: స్పష్టమైన ఆధిక్యతలో వంగవీటి రాథాకృష్ణ: రెండో స్థానంలో ఏబీవీ.!
Publish Date:Nov 3, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విజయవాడ మేయర్ స్థానానికి సంబంధించిన ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అధికారిక తెలుగుదేశం కూటమి అభ్యర్థి అభ్యర్థి, జనసేన నాయకుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్గమైన ఆధిక్యిన్ని ప్రదర్శిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతులో మేయర్ అభ్యర్థిగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ వైసీపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక పోతే వంగవీటి రాధాకృష్ణ బెజవాడ నగరంలో తనకున్న విస్తృతమైన ప్రజాదరణకు తోడు కూటమి శ్రేణుల బలం తోడవడంతో ఆరంభం నుంచీ గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. ఒక్కో రౌండుకూ వంగవీటి రాధా ఆధిక్యం పెరుగుతూ వస్తున్నది. అలాగే విజయవాడ నగరంలోనిమెజారిటీ డివిజన్లలో తెలుగుదేశం కూటమికి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక విజయవాడ మేయర్ బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి, స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మేధావులు, వామపక్షాల మద్దతుతో పాటు నగరంలోని విద్యావంతులైన ఓటర్ల మద్దతును పొందడంలో ఆయన సక్సెస్ అయ్యారని అవగతమౌతుంది. ఈ ప్రతిష్ఠాత్మక స్థానంలో వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మూడో స్థానానికి పరిమితమౌతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని భావించినప్పటికీ, నగర ఓటర్లు కూటమి అభ్యర్థికే జైకొడుతున్నారని కౌంటింగ్ లో వెల్లడౌతున్న ఫలితాన్ని బట్టి స్పష్టమౌతోంది.
ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణ, ఏబీ వెంకటేశ్వరరావు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు పోకుండా హుందాతనంతో వ్యవహరించడం విశేషం. నగరాభివృద్ధికి సంబంధించి మేధావుల, అనుభవజ్ఞుల సలహాలను స్వీకరిస్తానని రాధా ప్రకటించగా, ఇది కేవలం సిద్ధాంతాల పోరాటమని ఏబీవీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఈ ఎన్నికల పోరులో బెజవాడ ప్రజల మొగ్గు తెలుగుదేశం కూటమి వైపే ఉన్నట్లు ఓటింగ్ ను బట్టి స్పష్టంగా అవగతమౌతోంది. తుది రౌండ్ల లెక్కింపు కూడా త్వరలోనే పూర్తయిన అనంతరం విజయవాడ కొత్త మేయర్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.
[Vijayawada Mayor Election Results, Vangaveeti Radha Leading, AB Venkateswara Rao, Second Place, Vijayawada Corporation Counting, AP Local Body Polls, Telugu One]
http://www.teluguone.com/news/content/vijayawada-mayor-election-results-39-236145.html




