నేను గానీ, ఒక్క సైగ గానీ చేస్తే.. ప్రత్యర్థులకు జగన్ వార్నింగ్.!
Publish Date:Nov 2, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులకు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంత అడ్డా, తనకు కంచుకోట లాంటి పులివెందులలో స్థానిక పోలింగ్ సందర్భంగా వైసీపీకి ప్రతికూల పరిస్థితులు కనిపించడంతో ఆయన పరిధి దాటి తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులను బెదరించే రీతిలో, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ మున్సిపల్ పోలింగ్ బూత్‌లను పరిశీలిస్తున్న సమయంలో పలు చోట్ల వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆయనను నేరుగా అడ్డుకుని ఆరోపణలు గుప్పించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ అనూహ్య పరిణామాల మధ్య అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. వైసీపీ తరఫున మొత్తం ఎనభై మంది ఏజెంట్లు ఉంటే, కేవలం పది చోట్ల మాత్రమే అనుమతించి మిగిలిన డెబ్బై చోట్ల వారిని అణచివేశారని ఆయన ఆరోపించారు. పోలింగ్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతూ పోలీసుల అండతో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లినప్పటికీ, లోపలకు అనుమతించకపోవడంతో ఆయన కార్యాలయం వెలుపలే పార్టీ శ్రేణులు, బాధితులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ కార్యకర్తలు మరియు నాయకులపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ ఆయన చేసిన హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు. పులివెందులలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ మొత్తం వ్యవహారంపై అధికార తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతలే కావాలని ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు యత్నించారని విమర్శించింది. ఓటమి భయంతోనే జగన్ బెదరింపు నాటకాలకు తెరలేపారని ఆరోపించింది. మొత్తం మీద జగన్ కు సొంత గడ్డ, సొంత అడ్డాలోనూ అనూహ్య రీతిలో తీవ్ర ప్రతిఘటన వ్యక్తమైంది. [Protests Pulivendula Against Jagan, Pulivendula Municipal Elections, Jagan Violent Warnin, Pulivendula Election, Telugu One]
http://www.teluguone.com/news/content/protests-pulivendula-against-jagan-39-236067.html




