కేసీఆర్‌కు రేవంత్ స్పైసీ విషెష్.. అదిచూస్తే ఆయన ఏడ్వాల్సిందే!
Publish Date:Feb 17, 2022
Advertisement
రేవంత్‌రెడ్డి ఏం చేసినా అది వెరైటీగానే ఉంటుంది. అందులో స్పైసీ కూడా ఉంటుంది. రొటీన్ పాలిటిక్స్‌కు భిన్నంగా ఉంటాయి ఆయన చేష్టలు. ఇక రేవంత్ ఎత్తుగడలైతే ఎవరి అంచనాలకూ అందవు. అందుకే, ఆయన మాటలు, చేతలు.. మంట రాజేస్తుంటాయి. ఇక, కేసీఆర్‌ను నిత్యం నీడలా వెంటాడుతూనే ఉంటారు రేవంత్‌రెడ్డి. ఎప్పుడూ ఏదో ఒకటి గిల్లుతూనే ఉంటారు. అలాంటిది కేసీఆర్ బర్త్‌డే అంటే వదిలిపెడతారా? అందులోనూ రెండు రోజుల పాటు గులాబీ బాస్ ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటారా? అందుకే, బర్త్‌డే రోజు కూడా కేసీఆర్‌కు మనఃశాంతి లేకుండా చేస్తున్నారు పీసీసీ చీఫ్. మామూలుగా అయితే బర్త్‌డే అంటే రొటీన్‌గా విషెష్ చెప్పడం ఖాయం. ఎంతటి రాజకీయ శత్రువు అయినప్పటికీ.. ఫార్మల్‌గా విష్ చేస్తుంటారు. సీఎం కేసీఆర్ పుట్టునరోజున పీఎం మోదీ సైతం విషెష్ చెబుతూ ట్వీట్ చేశారు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పుట్టిన రోజు నాడు కూడా గిల్లడం ఆపలేదు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. ఊసరవెల్లి ఫోటో షేర్ చేస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆయనెక్కడా కేసీఆర్ పేరు ప్రస్తావించకున్నా.. రేవంత్ ఊసరవెల్లి ఫోటోతో బర్త్‌డే విషెష్ చెప్పింది కేసీఆర్‌కేననేది కన్ఫామ్. ఈ ట్వీట్‌పై నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది రేవంత్‌రెడ్డి ట్వీట్. ఇక, రేవంత్ మరో ట్వీట్‌లో ‘కేసీఆర్ తన నీడకు కూడా భయపడుతున్నారు. సీఎం పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వీలుగా వరుసగా రెండో రోజు పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఒకపక్క నిరుద్యోగ యువత ప్రాణాలు విడుస్తుంటే.. ఇది సంబరాలు చేసుకునే సమయమా...?!’’ అంటూ ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-variety-tweet-on-kcr-birth-day-39-131909.html





