సూపర్ మోడల్‌గా మారిన బెగ్గర్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..
Publish Date:Feb 17, 2022
Advertisement
కాలం కలిసి వస్తే... రాత్రికి రాత్రే జీవితం మారిపోతోంది. రోజూ కూలీ పని చేసుకుని వంద రూపాయిలు సంపాదించుకునే అతడు.. ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోయాడు. అలాగని అతడికేమీ లాటరీ తగల్లేదు. కానీ ఒక్కే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చినట్లు.. ఒకే ఒక్క ఫొటో అతడి జీవితాన్ని మార్చేసింది. ఆ ఫొటోతో రోజు కూలీ కాస్తా శ్రీమంతుడిగా మారిపోయాడు. ఒకప్పుడు పాత లుంగీ, పాత చొక్క ధరించి అతడు.. కాలినడకన కొజికోడ్‌లో పని కోసం తిరిగిన మామ్మిక్కా ఇప్పడు.. ఖరీదైన కార్లలో అదే రోడ్డుపై చక్కర్లు కొడుతున్నాడు. కేరళలోని కొజికోడ్ జిల్లాకు చెందిన 67 ఏళ్ల మామ్మిక్కా.. రోజు కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. అయితే మామ్మిక్కాకు అదృష్టం తలుపు తట్టింది. ఒకే ఒక్క ఫొటోతో అతడు ఓవర్ నైట్ సెలబ్రెటి అయిపోయాడు. మోడల్ అయిపోయి... పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్ కూడా అయిపోయాడు. నిన్నటి దాక రోజుకు వంద రూపాయిల కూలీకి పని చేసిన మామ్మిక్కా... ఇప్పడు లక్షలు సంపాదిస్తున్నాడు. మామ్మిక్కా జీవితం ఒక్కసారిగా మారిపోవడానికి కారణం.. ఫొటోగ్రాఫర్ షరీక్ వాయలీల్.
మామ్మిక్కాను చూసి అతడిలో ఏదో ఉందని గమనించిన షరీక్.... అతడిని ఓవర్ నైట్ స్టార్‌ను చేశాడు. మామ్మిక్కాను ఫొటో తీసిన షరీఫ్... దానిని తన సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మామ్మిక్కా అచ్చుగుద్దినట్లు వినాయకన్‌లా ఉన్నాడంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో మామ్మిక్కాను ఎలాగైనా మోడల్ చేయాలని అనుకున్న ఫొటోగ్రాఫర్ షరీక్ వాయలీల్... తన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్‌గా ఉండాలని కోరాడు. అందుకు అతడు వెంటనే ఒప్పుకోవడంతో.. మామ్మిక్కాను బ్యూటీ పార్లర్‌కు తీసుకు వెళ్లి.. మేక్ ఓవర్ చేసి.. సూట్ వేసి... ఫోటోషూట్ చేసి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. దాంతో ఇతర కంపెనీలు కూడా రంగంలోకి దిగి.. మామ్మిక్కాను తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరడం గమనార్హం.
అయితే అతడు మోడల్‌గా కొనసాగుతూనే.. తన కూలి పనిని కూడా చేస్తానంటూ మామ్మిక్కా చెప్పడం గమనార్హం. అన్నం పెట్టిన ఆ పనిని వదులుకోబోనని మామ్మిక్కా స్పష్టం చేశారు. ఇప్పడు మోడల్‌గా లక్షలు సంపాదిస్తూ.. తన జీవితాన్ని ఒక్క రోజులో మార్చేసుకున్నాడీ మామ్మిక్కా.
http://www.teluguone.com/news/content/begger-becomes-super-model-39-131912.html





