తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ప్రస్తుతం కరీంనగర్ జైలులో ఉన్నారు. ఉద్యోగ , ఉపాధ్యాయ సమస్యలపై కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష తలపెట్టిన బండి సంజయ్ ని బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా అక్కడ యుద్దమే జరిగింది. సంజయ్ ను అదుపులోనికి తీసుకునేందుకు కార్యాలయం గేట్లు బద్దలు కొట్టారు పోలీసులు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించారు. బీజేపీ కార్యకర్తలను తరిమికొట్టారు. సంజయ్ అరెస్ట్ సమయంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిపై ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.
డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ తో పాటు పోలీసుల విధులకు ఆటంకం కల్గించారనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో కరీంనగర్ జైలుకు వెళ్లారు బండి సంజయ్.పార్టీ అధ్యక్షుడే జైలుకు వెళ్లడంతో బీజేపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. 14 రోజుల నిరసనలకు పిలుపిచ్చాయి. సంజయ్ ను జైలులో పెట్టడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కమలం కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. కరీంనగర్ జైలుకు వెళ్లి సంజయ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి.. తెలంగాణలో నియంత పాలన సాగుతుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సంజయ్ పై అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ కావడం, ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న బీజేపీ శ్రేణులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. డ్రామా మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ అరెస్ట్ తో పార్ట్-1 పూర్తయిందని, పార్ట్-2లో భాగంగా జేపీ నడ్డా గారిని ఇవాళ కస్టడీలోకి తీసుకుంటారని వెల్లడించారు. ఇదంతా కూడా బీజేపీనే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమని చూపించడం కోసమేనా? అని రేవంత్ ప్రశ్నించారు."సరే, ఈ విషయం నేను బహిర్గతం చేశాను కాబట్టి, డ్రామా ఎలా సాగుతుందో చూద్దాం" అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్న బీజేపీ క్యాండిల్ ర్యాలీ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. జేపీ నడ్డాను విమాశ్రయంలోనే పోలీసులు అడ్డుకుంటారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం చెబుతూ ట్వీట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే జేపీ నడ్డాను ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకుంటారా.. ఆయన ఆరోపించినట్లే తెలంగాణలో రాజకీయ డ్రామా జరుగుతుందా అన్న చర్చ జనాల్లో సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-reddy-sensational-comments-on-bandi-sanjay-jail-39-129622.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.