కవితకు రేవంత్ జబర్దస్త్ కౌంటర్.. ట్విట్టర్ వార్

Publish Date:Feb 15, 2022

Advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యూహం ఏమిటో కానీ, ఆయన ‘మోర్ లాయల్ ద్యాన్ ద కింగ్’ తరహాలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కంటే ఎక్కువగా రాహుల్‌ గాంధీని, నెహ్రూ గాంధీ ఫ్యామిలీని తెగ పొగిడేస్తున్నారు. రాహుల్ గాంధీ పుట్టుకకు సంబంధించి అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండించారు. అంతే కాదు, అయన తరపున ఈయనే పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. 

అదలా ఉంటే, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మరో అడుగు ముందుకేసి, కేసీఆర్ విశాల హృదయాన్ని ట్విట్టర్’లో పరిచే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బీజేపీ అవమానించిన సమయంలో కేసీఆర్ కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా మాట్లాడారని, రాజకీయాలకు అతీతంగా దేశంలో గౌరవప్రదమైన రాజకీయాలను కేసీఆర్ నిలబెట్టారని కవిత ట్వీట్ చేశారు. అది కేసీఆర్ గొప్పతనం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. అయితే, ఈ ట్వీట్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే ట్విట్టర్ వేదికగా, అంతే జబర్దస్త్’గా  కౌంటరిచ్చారు. 

మొసలి కన్నీరు కార్చడంలో మీ పార్టీ నాయకత్వం ప్రావీణ్యం సాధించిందని పరోక్షంగా కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు వేశారు.. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను, తెలంగాణ తల్లిని ప్రధాని నరేంద్ర మోడీ  అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ టాగోర్  కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్య ట్వీట్ వార్ జరిగింది. కొట్లాది మంది తెలంగాణ యువత, సోనియా గాంధీ కోరుకున్న తెలంగాణ కోసం పని చేస్తూనే ఉంటుంది అది నెరవేరాలంటే  ఊసరవెల్లి టీఆర్‌ఎస్, మతతత్వ బీజేపీని ఓడించాలి. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి 2 పార్శ్వాలు. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయగలదని మాణికం ఠాగూర్  చేసిన ట్వీట్ కు  కవిత స్పందించారు. ప్రజల పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని కవిత చెప్పారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటం సాగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

అదలా ఉంటే కేసీఆర్’కు కాంగ్రెస్ మీద ఒక్కసారిగా ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది అనే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. తెరాస ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ నుంచి బీజేపీ తరలించెందుకే కేసీఆర్, కాంగ్రెస్ పార్టీఫై ప్రేమ నటిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరో వంక బీజేపీ, కాంగ్రెస్,తెరాస ఒకటే అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.