కోల్డ్‌వార్ ముగిసినట్టేనా?.. కేసీఆర్ ట్రాప్ నుంచి జస్ట్ మిస్! తగ్గి నెగ్గిన రేవంత్..
Publish Date:Feb 15, 2022
Advertisement
రేవంత్‌రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి. టి-కాంగ్‌లో కోల్డ్‌వార్. ఎప్పటినుంచో ఉన్న విషయమే. అందరికీ తెలిసిన విషయమే. పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం ఆ ఇద్దరు హోరాహోరీ పోటీ పడ్డారు. చివరకు సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని.. డైనమిక్ లీడర్ రేవంత్‌రెడ్డికే పట్టం కట్టింది 10 జన్‌పథ్. అప్పటి నుంచీ కోమటిరెడ్డి రగిలిపోతున్నారు. రేవంత్‌రెడ్డితో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారు. పీసీసీ చీఫ్ సైతం వెంకట్‌రెడ్డిని డోంట్ కేర్ అన్నట్టే ఉన్నారు. అలా అలా వారాలు, నెలలు గడిచిపోయాయి. అలాంటిది సడెన్‌గా నల్గొండలోని కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలిశారు రేవంత్‌రెడ్డి. మనం మనం ఒకే పార్టీ అంటూ కౌగిలించుకున్నారు.. షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు.. పూలబొకేలు పుచ్చుకున్నారు. ఫోటోలు దిగి.. హ్యాపీ టైమ్స్ అంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టుకున్నారు. అదేంటి? సడెన్‌గా రేవంత్‌రెడ్డి.. కోమటిరెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లినట్టు? అనే డౌటనుమానం రాకమానదు. ఊరికే వెళ్లరు రాజకీయ నాయకులు అంటారుగా.. ఈ భేటీకి కూడా పెద్ద రీజన్ లేకపోలేదు. కోమటిరెడ్డి జనగామ, భువనగిరిలో సీఎం కేసీఆర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తే.. అక్కడ హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి హ్యాండ్ షేక్ అయిందని అంటున్నారు. అందుకే, పరుగెత్తుకొని ఇంటికొచ్చి మరీ.. కోమటిరెడ్డి హ్యాండ్‌లో హ్యాండ్ వేసి మరీ.. మనం మనం అంటూ కూల్ చేశారని అంటున్నారు. ఇటీవల జనగామ, భువనగిరిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఆ ప్రాంత ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం ముఖ్యమంత్రి కార్యక్రమాలకు హాజరై.. ఆయనతో క్లోజ్‌గా మూవ్ అయ్యారు. కేసీఆర్‌ను కోమటిరెడ్డి పొగిడితే.. వెంకట్‌రెడ్డిని కేసీఆర్ కీర్తించారు. అలా వాళ్లిద్దరూ ఫీల్ గుడ్ ఫోజులివ్వడంతో.. అంతా అవాక్కయ్యారు. కాంగ్రెస్ ఎంపీ.. ఇలా గులాబీ బాస్‌తో క్లోజ్‌గా ఉండటమేంటనే చర్చ..రచ్చ మొదలైపోయింది. కోమటిరెడ్డి కాంగ్రెస్‌ను వీడిపోతారా? గులాబీ కండువ కప్పుకుంటారా? అంటూ అప్పటికప్పుడే మసాలా దట్టించేశారు. మరొకరైతే ఈపాటికే వివరణ ఇచ్చుకునే వారేమో గానీ.. అక్కడ ఉన్నది కోమటిరెడ్డి కావడంతో.. లైట్ తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నేత కావడం.. దాదాపు 10కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సత్తా ఉన్న నాయకుడు కావడంతో.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఉలిక్కిపడ్డారు. కోమటిరెడ్డితో కోల్డ్‌వార్ నడుస్తున్నా.. ఆయన పార్టీలో ఉంటే కాంగ్రెస్‌కే బలం..పరోక్షంగా అది రేవంత్‌రెడ్డికే లాభం. అందుకే, అప్పటికప్పుడు దిగొచ్చారు. పంతాలు, పట్టింపులు పక్కనపెట్టేసి.. 10 నెలల దూరాన్ని చెరిపేసి.. ఉన్నపళంగా కోమటిరెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కుషల సంభాషణలతో పాటు పార్టీ విషయాలూ మాట్లాడుకున్నారు. అలా.. తాను తగ్గి.. పీసీసీ చీఫ్‌గా నెగ్గారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ ట్రాప్ నుంచి కోమటిరెడ్డిని బయటపడేసే ప్రయత్నం చేశారు.
http://www.teluguone.com/news/content/reasons-behind-revanth-reddy-visit-komatireddy-house-39-131812.html





