మరీ అంత అతి చేయకు..
Publish Date:Nov 3, 2017
Advertisement
ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతానందంటా... అలా ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం. నిన్న గాక మొన్న వేరే పార్టీలోకి జంప్ అయి అప్పుడే అక్కడి నేతలకు అనవసరపు హామీలు ఇస్తున్నాడు. అదీ ఎవరి విషయంలోనో కాదు.. ఏకంగా చంద్రబాబు నాయుడు విషయంలోనే. చంద్రబాబు నాయుడు అంటే తనకు ఇష్టమని... చంద్రబాబువల్లే తను ఈ స్థాయికి వచ్చానని.. చంద్రబాబును మాత్రం ఏ అననని పైకి చెబుతున్నా.. లోపల మాత్రం తాను చేయాల్సినవి చేస్తున్నాడు. చంద్రబాబును కావాలంటే కాంగ్రెస్ లోకి తీసుకొస్తానని చెబుతూ మాటలు చెబుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చేంత సీట్లు రావని భావించిన రేవంత్ రెడ్డి… ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని కాంగ్రెస్ కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవం కోసం లేనిపోని హామీలు ఇస్తున్నాడట. చంద్రబాబుతో తాను స్వయంగా చర్చించి ఈ విషయంపై ఒప్పిస్తానని మరీ చెప్పాడట. దీంతో తాను రాజకీయ పార్టీ మారుతున్నప్పుడు చంద్రబాబు ఏం అనలేదని... ఇప్పుడు ఇలాంటి హామీలు ఇచ్చినా ఏం అనరని రేవంత్ అనుకుంటున్నాడా...? అసలు ఎవరిని చూసుకొని రెచ్చిపోతున్నాడు...? రేవంత్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోయింది...? చంద్రబాబు అంటే మరీ అంత చూలకనగా కనిపిస్తోందా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మొదటి నుండి ఉప్పు.. నిప్పులాగ ఉన్న టీడీపీని-కాంగ్రెస్ ను కలుపుతానని రేవంత్ అనుకోవడం... అదీ కాకుండా చంద్రబాబును కూడా ఓప్పిస్తానని చెప్పడం పెద్ద కామెడి. ఏదో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పటికే తాను పార్టీ మారుతున్నప్పుడు నా వెనుకు చాలా మంది ఉన్నారు అని చెప్పుకున్నాడు. అందులో ఇప్పుడు చాలా మంది మళ్లీ టీడీపీలోకి వచ్చేస్తున్నారు. మరి ఇంతలా రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇస్తారో..? లేక పిల్లకాకి ఎందుకు ఉండేలు దెబ్బ అన్నట్టు.. దీనిపై స్పందించం కూడా టైం వేస్ట్ అని లైట్ తీసుకుంటారా చూద్దాం.. ఏం జరుగుతుందో.
http://www.teluguone.com/news/content/revanth-reddy-39-78614.html





